SRH vs LSG, IPL 2023: టాస్ గెలిచిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పలు.. ఆ ముగ్గురు ఔట్..

|

May 13, 2023 | 3:22 PM

Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో నేడు డబుల్ హెడర్ డే. నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్ (LSG) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

SRH vs LSG, IPL 2023: టాస్ గెలిచిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పలు.. ఆ ముగ్గురు ఔట్..
Srh Vs Lsg Live Score
Follow us on

Sunrisers Hyderabad vs Lucknow Super Giant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో నేడు డబుల్ హెడర్ డే. నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్ (LSG) మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో తొలుత బౌలింగ్ చేయనుంది. సన్‌రైజర్స్‌లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సన్వీర్ సింగ్‌కు అవకాశం లభించగా, లక్నోలో మొహ్సిన్ ఖాన్, దీపక్ హుడా స్థానంలో యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్‌లకు అవకాశం లభించింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.

లక్నో, హైదరాబాద్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడగా లక్నో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..