SRH vs KKR Score Highlights IPL 2021: 11 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం.. పోరాడి ఓడిన హైదరాబాద్‌

| Edited By: Shiva Prajapati

Apr 12, 2021 | 7:58 AM

SRH vs KKR Live Score in Telugu: చెన్నై వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పోరాడి ఓడింది. తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ ఓటమిని మూటగట్టుకుంది. మనీశ్‌ పాండే 61 పరుగుల చేసినా జట్టుకు..

SRH vs KKR Score Highlights IPL 2021: 11 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం.. పోరాడి ఓడిన హైదరాబాద్‌

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పోరాడి ఓడింది. తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ ఓటమిని మూటగట్టుకుంది. మనీశ్‌ పాండే 61 పరుగుల చేసినా జట్టుకు విజయం అందించలేక పోయాడు. 44 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు దూకుడుగా ఆడాడు. ఇక జానీ బెయిర్‌స్టో 40 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో విజృంభించి ఓటమి తప్పలేదు. 188 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే చేయడంతో కోల్‌కతా 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన కోల్‌కతా సీజన్‌లో శుభారంభం చేసింది.

భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగిన సన్‌రైజర్స్ ఛేజింగ్‌లో చెతకిలపడింది. 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్, వృద్ధిమాన్‌ సాహా వంటి కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత పాండే, బెయిర్‌స్టో జోడీ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభం నుంచి కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు నితీశ్‌ రాణా 56 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రాహుల్‌ త్రిపాఠి 29 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. హైదరాబాద్ ‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌(2/24), మహ్మద్‌ నబీ(2/32) మాత్రమే కోల్‌కతాను కట్టడి చేశారు. సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్ , సందీప్‌ శర్మ బౌలింగ్ పెద్దగా ఫలించలేదు. భారీ పరుగులను సమర్పించుకున్నారు.

Key Events

సన్‌రైజర్స్ హైదరాబాద్

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, సందీప్‌ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్

శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, పాట్‌ కమిన్స్‌, హర్భజన్‌సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 Apr 2021 11:12 PM (IST)

    తొలి పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన తొలి పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 177/5 స్కోరుకు పరిమితమైంది. మనీశ్‌ పాండే 61 పరుగులు చేయగా.. బెయిర్‌స్టో 54 పరుగులతో దూకుడుతో ఆడారు. హాఫ్ సెంచరీలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కోల్‌కతా 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

  • 11 Apr 2021 11:08 PM (IST)

    11 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

    మనీష్ పాండే చివరి బంతికి  ఒక సిక్సర్ కొట్టాడు, కాని అది జట్టును గెలవడానికి సరిపోలేదు. చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం, కాని హైదరాబాద్ కు కేవలం 10 పరుగులు మాత్రమే. దీంతో కోల్‌కతా 11 పరుగుల తేడాతో తమ ఖాతాను తెరిచింది.

  • 11 Apr 2021 11:05 PM (IST)

    ఎస్‌ఆర్‌హెచ్‌కు 22 పరుగులు కావాలి

    ఎస్‌ఆర్‌హెచ్‌కు చివరి ఓవర్‌లో 22 పరుగులు కావాలి.. ఇప్పటికే 2 పెద్ద సిక్సర్లు కొట్టిన అబ్దుల్ సమద్ దూకుడుతో ఆడుతున్నాడు. ఏదేమైనా అతని ముందు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు.  

  • 11 Apr 2021 11:04 PM (IST)

    అబ్దుల్ సమద్ సిక్సర్

    20 ఏళ్ల అబ్దుల్ సమద్ క్రీజ్‌లోకి రాగానే పాట్ కమ్మిన్స్ వంటి వెటరన్ బౌలర్‌పై 2 సిక్సర్లు కొట్టాడు. సమద్ తన మొదటి బంతిని ఇన్నింగ్స్‌లో సిక్స్ ఓవర్ మిడ్‌వికెట్‌కు పంపాడు. అప్పుడు ఓవర్ నాల్గవ బంతి లాంగ్ ఆన్ బౌండరీ వెలుపల 6 పరుగులు వచ్చాయి.

  • 11 Apr 2021 11:03 PM (IST)

    విజయ్‌ శంకర్‌ ఔట్‌

    రసెల్‌ వేసిన ఈ ఓవర్‌లో చివరి బంతికి విజయ్‌ శంకర్‌(11) ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 150 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో మనీశ్‌ పాండే ఒంటరిపోరాటం చేస్తున్నాడు.

  • 11 Apr 2021 11:01 PM (IST)

    మనీశ్‌ పాండే హాఫ్ సెంచరీ..

    వరుణ్‌ చక్రవర్తి వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులొచ్చాయి. చివరి బంతికి విజయ్‌ శంకర్‌(8) సిక్సర్‌ బాదాడు. అంతకుముందు మనీశ్‌ పాండే(51) తొలి రెండు బంతులకు మూడు పరుగులు చేసి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.

  • 11 Apr 2021 11:00 PM (IST)

    మహ్మద్‌ నబీ ఔట్

    ప్రసిద్ధ్‌ వేసిన 16వ ఓవర్‌లో హైదరాబాద్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ నబీ చివరి బంతికి మోర్గాన్‌ చేతికి చిక్కాడు. అంతకుముందు ఈ ఓవర్‌లో 12 పరుగులొచ్చాయి. మనీశ్‌ పాండే, శంకర్‌ క్రీజులో ఉన్నారు.

  • 11 Apr 2021 10:53 PM (IST)

    నబీకి గాయం

    ప్రసిద్ధ్‌ కృష్ణ వేస్తున్న పదునైన బంతులతో మొహమ్మద్ నబీని కలవరపెడుతున్నాడు. నబీ ఫాస్ట్ బౌన్సర్‌ను లాగాలని అనుకున్నాడు. కాని అతను అప్పటికే బంతి నుండి కన్ను తొలగించాడు. అందువల్ల బంతిని ఆడలేకపోయాడు. బంతి అతని కుడి చెవి వెనుక మెడకు తగిలింది. నబీ నొప్పితో కనిపించాడు. ప్రస్తుతానికి జట్టు వైద్యులు అతనిని పరీక్షిస్తున్నారు.

  • 11 Apr 2021 10:49 PM (IST)

    ఇప్పుడు సింగిల్స్ కాదు భారీ షాట్స్ అవసరం

    SRH కి కొన్ని మంచి ఓవర్లు అవసరం అవుతున్నాయి. ఈ జట్టుకు ఇప్పుడు భారీ షాట్లు అవసరం అవుతోంది. స్కోరు బోర్డు పరుగులు పెట్టాలంటే  పెద్ద షాట్లు అవసరం. దీని కోసం మొహమ్మద్ నబీ  దూకుడు పెంచుతున్నాడు. ప్రసిద్ధ కృష్ణ ఓవర్లో ఒక నాలుగు పరుగులు చేశారు.

  • 11 Apr 2021 10:41 PM (IST)

    మనీష్ పండే సిక్సర్

    బెయిర్‌స్టో వికెట్ పడిపోయిన తరువాత కూడా మనీష్ పండే దూకుడు తగ్గలేదు.  మనీష్ పాండే తన జట్టు కోసం దూకుడుగా ఆడుతున్నాడు. షకీబ్ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. అర్ధ సెంచరీకి దగ్గరవుతున్నాడు మనీష్ పండే. 

  • 11 Apr 2021 10:39 PM (IST)

    ‌హైదరాబాద్ కీలక వికెట్ పడింది… స్టో ఔట్

    పాట్ కమ్మిన్స్ కీలక వికెట్ పడేశాడు. కమ్మిన్స్ వేసిన ఓవర్ చివరి బంతిని బైర్‌స్టో బౌండరీకి తరలించే ప్రయత్నాం చేశాడు. ఇది విఫలమైంది. కాని పాయింట్‌పై నిలబడి ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ 55 పరుగులు ముగిసింది.

  • 11 Apr 2021 10:33 PM (IST)

    59 పరుగుల భాగస్వామ్యాంతో..

    కేవలం 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్.. ప్రస్తుతానికి ట్రాక్‌లోకి వస్తోంది. దీనికి తోడు మనీష్ పాండే, బెయిర్‌స్టో ఇద్దరూ కలిసి దూకుడుగా ఆడుతున్నారు. బెయిర్‌స్టో తన అలవాటు ప్రకారం దూకుడు విధానాన్ని పెంచాడు. మనీష్ కూడా కొన్ని షాట్లు తీసుకున్నాడు. కానీ బాగా ఆడుతున్నాడు. ఇద్దరూ 59 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.

  • 11 Apr 2021 10:30 PM (IST)

    బెయిర్‌ స్టో హాఫ్ సెంచరీ

    వరుణ్‌ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో తొలి బంతిని బెయిర్‌ స్టో(54) సిక్సర్‌ బాదేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్టో దూకుడు మీదున్నాడు. స్టోకు తోడుగా మనీశ్‌ పాండే 34 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.

  • 11 Apr 2021 10:28 PM (IST)

    12 ఓవర్లకు హైదరాబాద్ 100 పరుగులు

    12 ఓవర్లకు హైదరాబాద్‌ 2 వికెట్లను కోల్పోయి 100 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(3), వృద్ధిమాన్‌ సాహా(7) వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే వార్నర్‌ను ప్రసిధ్‌ కృష్ణ పెవిలియన్‌ పంపగా.. ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్‌ సాహాను స్పిన్నర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ వెనక్కి పంపాడు. కోల్‌కతా కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్‌ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం మనీశ్‌ పాండే(12), జానీ బెయిర్‌స్టో(13) క్రీజులో ఉన్నారు.

  • 11 Apr 2021 10:24 PM (IST)

    బెయిర్‌ స్టో బౌండరీ

    వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ను కూడా బెయిర్ స్టో తనకు అనుకూలంగా మార్చకుంటున్నాడు. 10వ ఓవర్లో ఐదో బంతిని బెయిర్‌ స్టో బౌండరీకి తరలించాడు. మరో నాలుగు పరుగులొచ్చాయి. మరో తొమ్మిది పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తి అవుతుంది.

  • 11 Apr 2021 10:22 PM (IST)

    పాండే సిక్సర్

    మనీశ్ పండే దూకుడు మొదలు పెట్టాడు. అల్ హసన్ వేసిన 7వ ఓవర్లో మూడో బంతిని మనీశ్ పాండే సిక్సర్ కొట్టాడు. బెయిర్ స్టో(15) క్రీజులో ఉన్నాడు.

  • 11 Apr 2021 10:21 PM (IST)

    మనీశ్‌ పాండే బౌండరీ

    5 ఓవర్లలో హైదరాబాద్ జట్టు కొద్దగా వేగం పెంచింది.  షకిబ్‌ అల్‌ హసన్‌ వేసిన ఈ ఓవర్లో ఐదో బంతిని మనీశ్‌ పాండే బౌండరీకి తరలించాడు.

  • 11 Apr 2021 10:19 PM (IST)

    బెయిర్ స్టో సిక్సర్

    షకిబ్‌ అల్‌ హసన్‌ వేసిన 5వ ఓవర్లో రెండో బంతికి బెయిర్‌ స్టో  సిక్సర్‌గా మార్చాడు..

  • 11 Apr 2021 09:52 PM (IST)

    సాహా సిక్సర్‌తో మొదలు పెట్టాడు

    హర్భజన్‌ సింగ్‌ వేసిన తొలి ఓవర్‌లో హైదరాబాద్‌ 8 పరుగులు సమర్పించుకున్నాడు. ఓపెనర్లుగా డేవిడ్‌ వార్నర్‌(1), వృద్ధిమాన్‌ సాహా(7) దూకుడు మీదున్నారు. అయితే, చివరి బంతికి సాహా సిక్సర్‌తో మొదలు పెట్టాడు.

  • 11 Apr 2021 09:37 PM (IST)

    మరో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

    3 ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది హైదరాబాద్. 11 పరుగుల వద్ద షకిబ్‌ అల్‌ హసన్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి సాహా బౌల్డయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 10 పరుగులకే మరో కీలక వికెట్ కోల్పోయింది.

  • 11 Apr 2021 09:35 PM (IST)

    డేవిడ్‌ వార్నర్ ఔట్

    2 ఓవర్లలో హైదరాబాద్ భారీ షాక్ తగిలింది. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఔటయ్యాడు.

  • 11 Apr 2021 09:11 PM (IST)

    హైదరాబాద్ జట్టుకు ప్రాణం పోసిన నబీ

    ఎస్‌ఆర్‌హెచ్ తిరిగి పుంజుకుంది. ఆఫ్ఘన్ స్పిన్నర్ నితీష్ రానా, కెకెఆర్ కెప్టెన్ అయెన్ మోర్గాన్ వరుసగా ఔట్ చేసిన మొహమ్మద్ నబీ జట్టుకు ప్రాణం పోశాడు.  నబీ వేసిన 18వ ఓవర్‌లో రాణా(80), మోర్గాన్‌(2) వరుస బంతుల్లో ఔటయ్యారు. షకీబ్‌ (1), దినేశ్‌ కార్తీక్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 11 Apr 2021 09:07 PM (IST)

    ఆండ్రీ రస్సెల్ ఔట్

    రషీద్ ఖాన్ తన చివరి ఓవర్లో జట్టుకు చాలా పెద్ద వికెట్ అందించాడు. రషీద్ వేసిన  బంతిని ఆండ్రీ రస్సెల్ లాంగ్ ఆన్ వైపుకు కొట్టి దొరికిపోయాడు. ఆండ్రీ రస్సెల్ మనీష్ పాండే డైవ్ చేసి క్యాచ్ పట్టాడు.

     

  • 11 Apr 2021 09:04 PM (IST)

    రాహుల్ త్రిపాఠి తుఫానుకు బ్రేక్

    రాహుల్ త్రిపాఠి తుఫానుకు బ్రేక్ పడింది.  నటరాజన్ వేసిన బంతిని త్రిపాఠి స్లాగ్ షాట్‌ను లాంగ్ ఆన్ మీదుగా పంపించటానికి ప్రయత్నించి దొరికిపోాయాడు.  కాని అతను తన షాట్‌ను సరిగ్గా టైమింగ్‌తోపాటు బంతి బ్యాట్ అంచుని తగలడంతో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా క్యాచ్‌ ఇచ్చి ఇన్నింగ్స్ ముగించాడు.

  • 11 Apr 2021 09:01 PM (IST)

    సందీప్ శర్మ మరో సిక్సర్..

    సందీప్ శర్మ వేసిన 14వ ఓవర్‌లో మూడో బంతిని రాణా సిక్సర్ కొట్టాడు. రాహుల్‌ త్రిపాఠి(39) క్రీజులో ఉన్నాడు.

  • 11 Apr 2021 08:58 PM (IST)

    దుమ్మురేపుతున్న రాణా‌..త్రిపాఠి

    మహ్మద్‌ నబీ వేసిన 12వ ఓవర్లో తొలి బంతికి త్రిపాఠి ఫోర్‌ బాదేశాడు. ఇక అదే ఓవర్ మూడో బంతిని రాణా(64) సిక్సర్‌గా మార్చాడు.

  • 11 Apr 2021 08:41 PM (IST)

    హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాణా‌

    విజయ్ శంకర్‌ బౌలింగ్‌కు దిగాడు. రెండో బంతిని త్రిపాఠి(18) బౌండరీకి తరలించగా..చివరి బంతిని రాణా(50) సిక్సర్‌గా  మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తం 14 పరుగులొచ్చాయి.

  • 11 Apr 2021 08:14 PM (IST)

    గిల్ ఔట్..

    ఖాన్ వేసిన బౌలింగ్‌లో గిల్ ఔటయ్యాడు. SRH యొక్క ట్రంప్ కార్డు రషీద్ ఖాన్ తన మొదటి ఓవర్లో కెప్టెన్ కోసం పనిచేశాడు. రషీద్‌ ఖాన్ వేసిన ఈ ఓవర్లో చివరి బంతికి శుభమన్‌ గిల్‌(15) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. రాణా(38), త్రిపాఠి క్రీజులో ఉన్నారు.

     

  • 11 Apr 2021 08:01 PM (IST)

    నితీశ్‌ రాణా దూకుడు… హ్యాట్రిక్‌ ఫోర్లు..

    నితీశ్ రాణా దూకుడు పెంచాడు. 4వ ఓవర్‌లో వరుస ఫోర్లతో దుమ్మురేపుతున్నాడు. సందీప్‌ శర్మ వేసిన ఈ ఓవర్‌లో మొదటి మూడు బంతులను నితీశ్‌ రాణా బౌండరీకి పంపాడు.

  • 11 Apr 2021 07:54 PM (IST)

    తొలి బంతిని బౌండరీగా మార్చిన నితీశ్ రాణా..

    బౌండరీతో మొదలు పెట్టింది కోల్‌కతా నైట్‌ రైడర్స్. తొలి ఓవర్‌లోని మొదటి బంతిని ఫోర్‌ కొట్టాడు నితీశ్ రాణా. తర్వాత భువీ  కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. శుభమన్‌ గిల్‌ క్రీజులో ఉన్నాడు.

  • 11 Apr 2021 07:42 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు సభ్యులు వీరే…

    చెపాక్‌ స్టేడియంలో మంచి రికార్డు కలిగిన సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను కోల్‌కతా తుది జట్టులోకి తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు సభ్యులు వీరే…

    కోల్‌కతా జట్టు:  శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, పాట్‌ కమిన్స్‌, హర్భజన్‌సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

  • 11 Apr 2021 07:41 PM (IST)

    హైదరాబాద్ తుది జట్టు సభ్యులు వీరే..

    టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తుది జట్టు సభ్యులు వీరే..

    హైదరాబాద్ జట్టు:  డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, సందీప్‌ శర్మ

     

     

  • 11 Apr 2021 07:29 PM (IST)

    విజయంతో మొదలు పెట్టాలని చూస్తున్న ఇరు జట్లు..

    ఇరు జట్లకు ఐపీఎల్ 2021 సీజన్‌ను విజయంతో మొదలు పెట్టాలని చూస్తున్నాయి. హైదరాబాద్‌ 2016లో చివరిసారి ట్రోఫీని ముద్దాడగా, కోల్‌కతా 2014లో చివరిసారి విజేతగా నిలిచింది. దీంతో అప్పటి నుంచి ఇరు జట్లూ మరో టైటిల్‌ కోసం కష్టపడుతున్నాయి. అయితే విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి..

  • 11 Apr 2021 07:27 PM (IST)

    టాస్‌ గెలిచి బౌలింగ్‌‌ ఎంచుకున్న సన్‌రైజర్స్

    టాస్‌ గెలిచిన హైదరాబాద్ సన్‌రైజర్స్ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు.

  • 11 Apr 2021 06:46 PM (IST)

    శుభారంభం చేయాలని చూస్తున్న ఇరు జట్లు..

    తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లూ ఆశిస్తున్నాయి.

Follow us on