ఢిల్లీపై హైదరాబాద్ విజయం

|

Apr 05, 2019 | 6:37 AM

ఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్‌లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ బెయిర్‌స్టో (48: 28 బంతుల్లో 9×4, 1×6), ఆల్‌రౌండర్ మహ్మద్‌ నబి (17; 9 బంతుల్లో 2×4, 1×6; 2/21) మరోసారి రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43: 41 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ […]

ఢిల్లీపై హైదరాబాద్ విజయం
Follow us on

ఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్‌లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ బెయిర్‌స్టో (48: 28 బంతుల్లో 9×4, 1×6), ఆల్‌రౌండర్ మహ్మద్‌ నబి (17; 9 బంతుల్లో 2×4, 1×6; 2/21) మరోసారి రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

అంతకుముందు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (43: 41 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. అటు సన్‌రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్‌, నబి, కౌల్ రెండేసి వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టిన బెయిర్‌స్టోకు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.