IND vs WI 2nd Test: రెండో టెస్ట్‌కి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రేషన్స్ ప్లేయర్.. వికెట్ పడితే మైదానంలో రచ్చ రచ్చే..

West Indies Squad for 2nd Test: భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం వెస్టిండీస్ జట్టు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

IND vs WI 2nd Test: రెండో టెస్ట్‌కి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రేషన్స్ ప్లేయర్.. వికెట్ పడితే మైదానంలో రచ్చ రచ్చే..
Wi Vs Ind 2nd Test

Updated on: Jul 18, 2023 | 12:26 PM

IND vs WI: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలో రెండవ టెస్ట్ కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రెండో టెస్టు జట్టులో కీలక విషయం ఏమిటంటే.. మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించే ఆటగాడిని చేర్చారు. వెస్టిండీస్ టెస్టు జట్టులోకి తొలిసారిగా ఎంపికైన ఈ ఆటగాడి పేరు కెవిన్ సింక్లెయిర్.

23 ఏళ్ల సింక్లెయిర్‌కు అవకాశం లభిస్తే, అతను భారత్‌తో జరిగే రెండో టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 54 వికెట్లు తీశాడు. ఇంతకు ముందు వెస్టిండీస్ తరపున 7 వన్డేలు, 6 టీ20లు ఆడిన అనుభవం ఉంది.

వికెట్ తీస్తే గాల్లో సంబురాలు..

గయానాలో జన్మించిన కెవిన్ సింక్లెయిర్.. వికెట్ తీసిన తర్వాత అద్భుతమైన వేడుకలకు ప్రసిద్ధి చెందాడు. మైదానంలో సర్కస్‌ చేస్తున్నట్లుగా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంటాడు. వికెట్ తీసిన వెంటనే గాలిలో పల్టీలు కొట్టడం కనిపిస్తుంది. రామన్ రీఫర్ స్థానంలో కెవిన్ సింక్లెయిర్ జట్టులోకి ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి

కెవిన్ సింక్లెయిర్‌ మార్పు తప్ప రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టులో పెద్దగా ఏం మారలేదు. తొలి టెస్టులో వెస్టిండీస్ కేవలం 3 రోజుల్లోనే ఓడిపోయింది. దీంతో భారత్‌ను ఇన్నింగ్స్‌ 141 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

రెండో టెస్టులో విజయం కోసం వెస్టిండీస్ కసరత్తులు..

ఇలాంటి పరిస్థితుల్లో ట్రినిడాడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో విజయం సాధించేందుకు వెస్టిండీస్ శాయశక్తులా ప్రయత్నిస్తుంది. సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకునేందుకు భారత్‌కు గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఇది కాకుండా టెస్ట్ సిరీస్‌ను గెలవకుండా కూడా భారత్‌ను ఆపగలదు. భారత్, వెస్టిండీస్ మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది.

రెండో టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జె. బ్లాక్‌వుడ్ (వికెట్ కీపర్), అలిక్ అథనాజ్, తేజ్‌నరైన్ చందర్‌పాల్, రహ్కీమ్ కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకెంజీ, కెమర్ రోచ్, కెవిన్ సింక్లైర్, జోమెల్ వారికన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..