Faf du Plessis retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ షాకింగ్ నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై

|

Feb 17, 2021 | 11:48 AM

దక్షిణాఫ్రికా  స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో​ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు...

Faf du Plessis retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ షాకింగ్ నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై
Follow us on

దక్షిణాఫ్రికా  స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో​ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయమని తన మనసు చెబుతున్నట్లు రాసుకొచ్చాడు. ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఆ పర్యటనలో విఫలమనప్పటి నుంచి డుప్లెసిస్ ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఇటీవలి శ్రీలంక పర్యటనలో, డు ప్లెసిస్ అద్భుతమైన సెంచరీ సాధించాడ.  గత సంవత్సరం నుంచి అతని ఫామ్‌ని ప్రశ్నిస్తున్నవారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం అతడి అభిమానులను షాక్‌కు గురిచేసింది. 

2012 నవంబరులో ఆస్ట్రేలియాలోని అడిలైడ్​ వేదికగా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫాఫ్​ డుప్లెసిస్​.. చివరిగా పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆడిన 69 టెస్టుల్లో.. 4 వేలకు పైగా రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  36 టెస్టుల్లో సౌతాఫ్రికా జట్టుకు డుప్లెసిస్​ కెప్టెన్​గా వ్యవహరించాడు.

Also Read:

 విద్యుత్ సంస్కరణలపై ఏపీ సర్కార్ తొలి విజయం.. కరెంట్ బిల్లు నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే..!

 పక్షి రెట్టలతో కాఫీ.. టేస్ట్‌లో ఎవరెస్ట్.. ఈ కాఫీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం