Video: సూర్య కుమార్ క్యాచ్ వివాదంలో కొత్త ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

|

Jul 05, 2024 | 7:50 AM

Suryakumar Yadav Catch Viral: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టుకోవడం పెను వివాదానికి కారణమైంది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే సూర్యకుమార్‌ ఎడమ పాదం బౌండరీకి ​​తాకినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది.

Video: సూర్య కుమార్ క్యాచ్ వివాదంలో కొత్త ట్విస్ట్.. కీలక వ్యాఖ్యలు చేసిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్
Suryakumar Yadav Catchvideo
Follow us on

Suryakumar Yadav Catch Viral: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టుకోవడం పెను వివాదానికి కారణమైంది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే సూర్యకుమార్‌ ఎడమ పాదం బౌండరీకి ​​తాకినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని కారణంగా ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇప్పుడు ఈ విషయంపై దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహరాజ్ కీలక ప్రకటన చేశాడు.

ఓ మీడియా ఇంటర్వ్యూలో కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను గుర్తుంచుకోవాలని, నిర్ణయాన్ని మార్చలేమంటూ చెప్పుకొచ్చాడు. ‘నిజం చెప్పాలంటే, ఓటమితో నేను చాలా నిరాశకు గురయ్యాను. ఏ నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా ఇప్పుడు మార్చలేం. ప్రతికూల విషయాలను చర్చించడం ఎవరికీ ప్రయోజనం కలిగించదు. మేం కొన్ని ముఖ్యమైన సమస్యలను చర్చించే సమయం ఉంది, మేం ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అలా చేస్తాం. ఏం జరిగిందో మరిచిపోయి ముందుకు సాగాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

చివరి ఓవర్‌లో మారిన గణాంకాలు..

తొలుత భారత్ స్కోరు బోర్డులో 176 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని మొదటి బంతి ఫుల్-టాస్. దీంతో డేవిడ్ మిల్లర్ భారీ షాట్ ఆడేందుకు బ్యాట్ ఝుళిపించడంతో బంతి బౌండరీ దాటి పోతుందేమో అనిపించింది. కానీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా అథ్లెటిక్ సామర్థ్యాన్ని ప్రదర్శించి క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. రెండో బంతికే కగిసో రబాడ ఫోర్ కొట్టినా, 7 పరుగుల ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..