SA vs USA: డికాక్, మార్క్‌రామ్ తుఫాన్ ఇన్నింగ్స్.. అమెరికా టార్గెట్ 195

South Africa vs USA, T20 World Cup 2024: టీ-20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అమెరికాకు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో టాస్ గెలిచిన అమెరికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే క్వింటన్ డి కాక్ వేగంగా అర్ధశతకం సాధించి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

SA vs USA: డికాక్, మార్క్‌రామ్ తుఫాన్ ఇన్నింగ్స్.. అమెరికా టార్గెట్ 195
Sa Vs Usa

Updated on: Jun 19, 2024 | 9:52 PM

South Africa vs USA, T20 World Cup 2024: టీ-20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అమెరికాకు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో టాస్ గెలిచిన అమెరికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే క్వింటన్ డి కాక్ వేగంగా అర్ధశతకం సాధించి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

ఒకానొక సమయంలో, డి కాక్, మార్క్‌రామ్ (46 పరుగులు) భాగస్వామ్యం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు 200 పరుగుల దిశగా పయనిస్తున్నట్లు అనిపించింది. అయితే సౌరభ్ నేత్రవాల్కర్, హర్‌ప్రీత్ సింగ్ తలో 2 వికెట్లు తీసి రన్ రేట్‌ను నియంత్రించారు. దక్షిణాఫ్రికాకు 194 పరుగులు మాత్రమే చేసింది.

అమెరికా: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే, తబ్రైజ్ షమ్సీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..