SA vs IND T20 WC Final Highlights: జగజ్జేతగా టీమిండియా.. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం

|

Jun 29, 2024 | 11:53 PM

India vs South Africa, T20 World Cup Final 2024 Highlights: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ మ్యాచ్ కు మరికొద్ది క్షణాలే మిగిలి ఉన్నాయి. వెస్టిండీస్‌లోని బార్బడోస్ మైదానం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లోని విశేషం ఏమిటంటే,

SA vs IND T20 WC Final Highlights: జగజ్జేతగా టీమిండియా.. ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం
SA vs IND T20 WC Final

India vs South Africa, T20 World Cup Final 2024 Highlights: ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టుపై భారత జట్టు అద్భుత విజయం సాధించింది.  ఓటమి కోర్లలోంచి తేరుకుని జగజ్జేతగా ఆవిర్భవించింది. ఫైన ల్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో సుమారు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ కప్ ను సొంతం చేసుకుంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ మ్యాచ్ కు మరికొద్ది క్షణాలే మిగిలి ఉన్నాయి. వెస్టిండీస్‌లోని బార్బడోస్ మైదానం ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లోని విశేషం ఏమిటంటే, ఈ రెండు జట్లు ప్రపంచకప్ టోర్నీలో అజేయంగా ఉన్నాయి. సెమీ-ఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక రెండవ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది.

 

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Jun 2024 11:51 PM (IST)

    భారత్ అద్భుత విజయం…

    ఓటమి కోరల్లోంచి తేరుకుని భారత జట్టు అద్భుత విజయం సాధించింది. జగజ్జేతగా ఆవిర్భవించింది. ఫైన ల్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో సుమారు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ కప్ ను సొంతం చేసుకుంది.

  • 29 Jun 2024 11:27 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

    దక్షిణాఫ్రికా జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. డేంజరస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ (17 బంతుల్లో 21) ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా విజయానికి 5 బంతుల్లో 16 పరుగులు అవసరం.


  • 29 Jun 2024 11:14 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

    దక్షిణాఫ్రికా జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. మార్కొ జాన్సెన్ బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు  ప్రస్తుతం సఫారీల విజయానికి 14 బంతుల్లో 21 రన్స్ అవసరం.

  • 29 Jun 2024 11:07 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

    దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ హెన్రిచ్ క్లాసెన్ (2 7 బంతుల్లో 52) ఔటయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు విజయానికి 20 బంతుల్లో 24 రన్స్ అవసరం.

  • 29 Jun 2024 11:01 PM (IST)

    క్లాసెన్ అర్ధ సెంచరీ.. విజయానికి చేరువలో సౌతాఫ్రికా..

    క్లాసెన్ అర్ధ సెంచరీతో దక్షిణాఫ్రికా విజయానికి చేరువలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు విజయానికి 26 బంతుల్లో 27 పరుగులు అవసరం. క్లాసెన్ 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 29 Jun 2024 10:48 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..

    దక్షిణాఫ్రికా జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. దూకుడు మీదున్న డికాక్ అర్ష్ దీప్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి కుల్ దీప్ యాదవ్ చేతికి చిక్కాడు. దక్షిణాఫ్రికా విజయానికి 45 బంతుల్లో 71 రన్స్ అవసరం.

  • 29 Jun 2024 10:35 PM (IST)

    10 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు ఎంతంటే?

    దక్షిణాఫ్రికా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 60 బంతుల్లో 98 పరుగులు అవసరం.

  • 29 Jun 2024 10:32 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..

    దక్షిణాఫ్రికా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతోన్న స్టబ్స్ (21 బంతుల్లో 31) అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 77/3 (9.4 ఓవర్లు ముగిసే సరికి)

  • 29 Jun 2024 10:20 PM (IST)

    నిలకడగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్..

    దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డికాక్ (15 బంతుల్లో 20), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 17) ఉన్నారు.

  • 29 Jun 2024 10:04 PM (IST)

    సౌతాఫ్రికాకు రెండో షాక్..

    దక్షిణాఫ్రికాకు రెండో షాక్ ఇచ్చాడు అర్ష్ దీప్. మూడో ఓవర్ లో కెప్టెన్ మర్ క్రమ్ ను పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 2 వికెట్ల నష్టానికి 13/2.

  • 29 Jun 2024 09:58 PM (IST)

    దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభమైంది. అర్షదీప్ మొదటి ఓవర్ లో 6 పరుగులు ఇవ్వగా, రెండో ఓవర్ లో బుమ్రా రీజా హెండ్రిక్స్ ను ఔట్ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు.

  • 29 Jun 2024 09:39 PM (IST)

    ముగిసిన టీమిండియా ఇన్నింగ్స్

    టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

  • 29 Jun 2024 09:38 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    శివవ్ దూబే రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 27 పరుగులు చేసిన దూబే ఆఖరి ఓవరల్ లో పెవిలియన్ కు చేరుకున్నాడు.

  • 29 Jun 2024 09:35 PM (IST)

    కింగ్ కోహ్లీ ఔట్..

    59 బంతుల్లో 76 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఔటయ్యాడు. మార్కొ జాన్సెన్  బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద రబాడాకు చిక్కాడు విరాట్.

  • 29 Jun 2024 09:20 PM (IST)

    కోహ్లీ అర్ధ సెంచరీ..

    కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో అర్ధ సెంచరీ మార్కు చేరుకున్నాడు కోహ్లీ. ప్రస్తుతం టీమిండియా స్కోరు 17 ఓవర్లు ముగిసే సరికి134/4.

  • 29 Jun 2024 09:04 PM (IST)

    47 పరుగుల వద్ద అక్షర్ రనౌట్..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 106 పరుగుల వద్ద అక్షర్ పటేల్ (47) రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 13.3 ఓవర్లు ముగిసేసరికి 103/4.

  • 29 Jun 2024 08:55 PM (IST)

    అక్షర్ దూకుడు..

    టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూకుడుగా ఆడుతున్నాడు. వికెట్ల పడడంతో సింగిల్స్ తీస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తున్నాడు.  ఇప్పటివరకు 3 సిక్సర్లు బాదాడు అక్షర్.మరోవైపు కోహ్లీ మాత్రం నిదానంగా ఆడుతున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 93/3.

  • 29 Jun 2024 08:43 PM (IST)

    నిలకడగా టీమిండియా బ్యాటింగ్..

    వరుసగా వికెట్లు 3 కోల్పోవడంతో టీమిండియా బ్యాటర్లు ఆచి తూచి ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ (32), అక్షర్ పటేల్ (25) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా  స్కోరు 75/3.

  • 29 Jun 2024 08:24 PM (IST)

    కష్టాల్లో టీమిండియా..

    టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది.ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య కుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. రబాడా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద క్లాసెన్ కు చిక్కాడు మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్. ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లు ముగిసే సరికి 39/3.

  • 29 Jun 2024 08:16 PM (IST)

    టీమిండియాకు డబుల్ షాక్..

    టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్ రోహిత్ శ ర్మ (9), వన్ డౌన్ బ్యాటర్ రిషబ్ పంత్ వెంట వెంటనే ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు కేశవ్ మహరాజ్ కే పడ్డాయి.

  • 29 Jun 2024 08:02 PM (IST)

    భారత బ్యాటింగ్ ప్రారంభం..

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇన్నింగ్స్ ప్రారంభించారు. మరోవైపు సౌతాఫ్రికా తరఫున మార్కొ జాన్సెన్ మొదటి ఓవర్ తీసుకున్నాడు.

  • 29 Jun 2024 07:54 PM (IST)

    పిచ్ రిపోర్టు ఏంటంటే?

    కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లోని పిచ్‌ ప్రావిడెన్స్‌ పిచ్‌కి భిన్నంగా ఉంటుంది. పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. ఆ తర్వాత స్వింగ్ వస్తుంది. తర్వాత ఈ పిచ్ బ్యాటర్లకు అనువుగా ఉంటుంది.

  • 29 Jun 2024 07:39 PM (IST)

    టాస్ గెల్చిన టీమిండియా… తుది జట్లు ఇవే..

    భారత్ (ప్లేయింగ్ XI):

    రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

    దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

    క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

  • 29 Jun 2024 07:23 PM (IST)

    వెదర్ రిపోర్ట్ ఏంటంటే?

  • 29 Jun 2024 07:22 PM (IST)

    బార్బడోస్ లో పరిస్థితి ఇది..

  • 29 Jun 2024 07:11 PM (IST)

    బార్బడోస్ లో టీమిండియా రికార్డులు ఇవే..

    బార్బడోస్‌లో టీమిండియాకు ఇది నాలుగో టీ20. ఇంతకు ముందు ఇక్కడ 3 మ్యాచ్‌లు ఆడగా 1 మాత్రమే గెలిచింది.  అయితే దక్షిణాఫ్రికాతో మాత్రం తొలిసారి  ఈ వేదికపై తలపడనుంది.

Follow us on