SA Vs ENG: ‘3’ నెంబర్‌‌తోనే ఈ జట్లకు మూడ్ వస్తది.. పాపం.! శని పిండి పిప్పి చేశాడుగా.. ఏ టీమ్ అంటే?

SA Vs ENG: 3 నెంబర్ చూస్తేనే ఆ జట్లకు మూడ్ వస్తుంది. ఆ ముందు ఘోరమైన ఆటతో ఓడిపోతారు. ఆ తర్వాత దుమ్ములేపుతారు. ఇక వన్డేలలో చరిత్ర చూడని ఇన్నింగ్స్ ఆడతారు. మరి ఆ రెండు జట్లు ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందామా..

SA Vs ENG: 3 నెంబర్‌‌తోనే ఈ జట్లకు మూడ్ వస్తది.. పాపం.! శని పిండి పిప్పి చేశాడుగా.. ఏ టీమ్ అంటే?
Sa Vs Aus Vs Eng

Updated on: Sep 08, 2025 | 5:34 PM

చోకర్స్ అనే పేరు.. ఎవరు పెట్టారో గానీ.. ఈ జట్టుకు సరిగ్గా సరిపోయింది. పెద్ద జట్లపై మూడు వన్డేల సిరీస్‌లోని రెండు వన్డేలు గెలిచి.. సిరీస్ కైవసం చేసుకుందని అనుకునేలోపు.. మూడో వన్డేలో అట్టర్ ప్లాప్ షో ఇచ్చి వన్డే చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఇక మనం మాట్లాడుకునేది ఏ జట్టో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.? అదే దక్షిణాఫ్రికా క్రికెట్ టీం. నిన్న(ఆదివారం) ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 342 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. వన్డే చరిత్రలో ఇంగ్లాండ్‌కు ఇది అతిపెద్ద విజయం కాగా.. సౌతాఫ్రికాకి అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఇంత పెద్ద టార్గెట్ చేధించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా బాష్(20) నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ 4 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో 342 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓడింది.

ఈ సిరీస్ తోలి రెండు వన్డేలలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికా మూడో వన్డేలో చతికిలబడింది. ఒక్క ఇంగ్లాండ్‌తో మాత్రమే కాదు.. ఇటీవల ఆస్ట్రేలియాతోనే దక్షిణాఫ్రికా తంతు ఇదే. మొదటి రెండు వన్డేలు గెలిచి.. ఆ తర్వాత చివరి వన్డేకి చేతులెత్తేసింది. అప్పుడు ఆస్ట్రేలియా మూడో వన్డేలో 431 పరుగులు చేయగా.. ఫలితంగా దక్షిణాఫ్రికా 155 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా వన్డే చరిత్రలో ఘోర ఓటములు చవిచూసింది దక్షిణాఫ్రికా.