Sourav Ganguly: ద్రవిడ్‎ను కోచ్‎గా ఎందుకు ఎంపిక చేశామంటే.. కారణం చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. అదేటంటే..

|

Nov 15, 2021 | 10:31 AM

భారత క్రికెట్ ప్రధాన కోచ్‎గా ద్రవిడ్ నియామకంపై అడిగిన ప్రశ్నకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫన్నీగా సమాధానమిచ్చారు. తనకు ద్రావిడ్ కొడుకు నుంచి కాల్ వచ్చిందని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్‎ను ఎంపిక చేయడానికి అదే కారణమన్నాడు...

Sourav Ganguly: ద్రవిడ్‎ను కోచ్‎గా ఎందుకు ఎంపిక చేశామంటే.. కారణం చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. అదేటంటే..
Sorav
Follow us on

భారత క్రికెట్ ప్రధాన కోచ్‎గా ద్రవిడ్ నియామకంపై అడిగిన ప్రశ్నకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫన్నీగా సమాధానమిచ్చారు. తనకు ద్రావిడ్ కొడుకు నుంచి కాల్ వచ్చిందని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్‎ను ఎంపిక చేయడానికి అదే కారణమన్నాడు. టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం “తన తండ్రి అతనితో చాలా కఠినంగా ఉన్నాడని, అతనిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ద్రవిడ్ కొడకు నుంచి కాల్ వచ్చింది. అప్పుడే రాహుల్ (ద్రావిడ్)కి ఫోన్ చేసి అతను జాతీయ జట్టులో చేరాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాను”. అని గంగూలీ చెప్పాడు. ఆయన 40వ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్నారు.

రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఆడుతున్నప్పుడు భారత క్రికెట్ జట్టులో తమ బంధం గురించి కూడా గంగూలీ చెప్పాడు. ఇద్దరం కలిసి ఒకే సమయంలో కెరిర్ ప్రారంభించాం. కాబట్టి ద్రవిడ్‌ను స్వాగతించడం BCCIలోని వ్యక్తులకు చాలా సులభం అని అతను చెప్పాడు. గంగూలీ, ద్రవిడ్ 1996లో భారతదేశం ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. వారు చాలా సంవత్సరాలు భారతదేశం కోసం కలిసి ఆడారు.

నవంబర్ 17, బుధవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడేందుకు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో ద్రవిడ్ ఇప్పటికే భారత జట్టుకు బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ KL రాహుల్ నేతృత్వంలోని భారత జట్టుకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ద్రవిడ్ గతంలో భారతదేశం A, భారత అండర్-19 జట్లకు హెడ్‎గా ఉన్నాడు. కోచ్‌గా తన సత్తాను నిరూపించుకున్నాడు. ద్రవిడ్ 2011లో క్రికెట్‎కు గుడ్ బైయ్ చెప్పాడు. ఎన్‎సీఏ హెడ్‎గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. భారత టీంకు ద్రవిడ్, ఎన్‎సీఏకు లక్ష్మణ్.. ఈ ఇద్దరు‎ భారత క్రికెట్‎ను ముందుకు తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also.. T20 World Cup 2021 Final: మొన్న హసన్ అలీ.. నిన్న హేజిల్‏వుడ్.. ఏం చేశారంటే..