Virat Kohli: టైటిల్ కోసం పూర్తి ప్రయత్నం చేశాను.. ఆర్సీబీకి కృతజ్ఞతలు.. విరాట్ కోహ్లీ భావోద్వేగ వీడియో..

|

Oct 13, 2021 | 4:58 PM

ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో ఒక శకం ముగిసింది. 2013 లో జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించడానికి కృషి చేశాడు...

Virat Kohli: టైటిల్ కోసం పూర్తి ప్రయత్నం చేశాను.. ఆర్సీబీకి కృతజ్ఞతలు.. విరాట్ కోహ్లీ భావోద్వేగ వీడియో..
Kohli Final
Follow us on

ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో ఒక శకం ముగిసింది. 2013 లో జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించడానికి కృషి చేశాడు. కానీ దరదృష్టవశాత్తు ఐపీఎల్ టైటిల్ గెలువలేకపోయారు. ఐపీఎల్ 2021 ఎలిమినేటర్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైనప్పుడు భావోద్వేగానికి గురైన కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో తన మనసులోని మాటను చెప్పాడు. జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని, ఆటగాళ్ల నుంచి తనకు లభించిన మద్దతును గుర్తుచేసుకున్నాడు.

“నేను ఈ ఫ్రాంచైజీని చాలా కాలం పాటు నడిపించాను కాబట్టి ఇది నాకు కొంత భావోద్వేగ క్షణం. జట్టు గెలిచి, మాకు టైటిల్ వచ్చేలా చేయడానికి నేను నా పూర్తి ప్రయత్నం చేశాను. దురదృష్టవశాత్తు అది జరగలేదు. నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఆర్సీబీ యూజమాన్యం నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా వద్ద ఉన్నవన్నీ నేను ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉంది” అని ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో కోహ్లీ అన్నారు.

బ్యాట్స్‌మన్‌గా అద్భుతమైన ప్రదర్శన చేసిన కోహ్లీ… ఐపీఎల్ టైటిల్ లేకుండానే జట్టు కెప్టెన్‎గా శకం ముగించేశాడు. 2016 లో టైటిల్‌కు దగ్గరగా వచ్చి తృటిలో కప్పును కోల్పోయారు. “నేను చెప్పినట్లుగా కొన్ని విషయాలు ఉద్దేశించబడలేదు. నేను చేయగలిగిన ప్రతిదానికీ నేను ఎప్పుడూ కృతజ్ఞుడను. RCB కి కెప్టెన్‌గా నాకు లభించిన గొప్ప అవకాశం ” అని కోహ్లీ నొక్కిచెప్పాడు.

సోమవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగలు చేసింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

 

 

Read Also..  T20 world Cup 2021: భారత్, ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు.. ఎందుకు రద్దు చేశారంటే..