
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ పెళ్లికి సంబంధించిన సందడి మొదలైంది. ఈ ఇద్దరూ ఇవాళ అంటే నవంబర్ 23న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శుక్రవారం జరిగిన హల్దీ వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, శనివారం రాత్రి జరిగిన సంగీత్ వేడుక వీడియో మాత్రం అందరి మనసు దోచుకుంది.
రొమాంటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి-పలాష్
సంగీత్ నైట్ షోకి సంబంధించిన ఒక వైరల్ వీడియోలో స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా సలామ్-ఏ-ఇష్క్ లోని ప్రముఖ పాట తేను లేకే మై జావంగా పాటకు ఈ జంట అద్భుతమైన డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. స్మృతి మొదట పలాష్ మెడలో దండ వేసి డ్యాన్స్‌ను ప్రారంభించగా, ఆ తర్వాత ఇద్దరూ పాట ట్యూన్‌కి అనుగుణంగా ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. స్మృతి డ్యాన్స్ చూసి అక్కడున్న అతిథులే కాదు, సోషల్ మీడియా యూజర్లు కూడా ముగ్ధులైపోయారు. వీరిద్దరి కెమిస్ట్రీని చూసిన నెటిజన్లు వీరిని పర్ఫెక్ట్ జోడి అంటూ పొగుడుతున్నారు.
టీమిండియా ప్లేయర్ల సందడి
స్మృతి మంధాన ఈ ప్రత్యేక సందర్భంలో తన జట్టు సభ్యులతో కలిసి కనిపించారు. భారత మహిళా క్రికెట్ జట్టులోని పలువురు క్రీడాకారిణులు సంగీత్ నైట్ షోలో గ్రూప్ డ్యాన్స్ చేశారు. తేరా యార్ హుం మై పాటకి జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, యాస్తికా భాటియా వంటి ఆటగాళ్లు ఉత్సాహంగా స్టెప్పులు వేయడం వీడియోలో కనిపించింది. ఈ హై ప్రొఫైల్ వివాహానికి సినిమా, క్రికెట్ ప్రపంచంలోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
డీవై పాటిల్ స్టేడియంలో ప్రపోజల్
స్మృతి, పలాష్ ముచ్ఛల్ వివాహానికి ముందు జరిగిన ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. పలాష్ మంధానను డీవై పాటిల్ స్టేడియంలో పెళ్లికి ప్రపోజ్ చేశారు. పలాష్ ముచ్ఛల్ ఈ అద్భుత క్షణానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలాష్ మోకాళ్లపై కూర్చొని స్మృతికి గులాబీల బొకే, ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయగా ఆ తర్వాత మంధాన కూడా పలాష్‌కు ఉంగరం తొడిగారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..