Video: పేరుకే ధోని శిష్యుడివి.. కీపర్‌గా గల్లీ ప్లేయర్‌వి.. స్టైల్‌కు పోయి స్టంపింగ్ మిస్ చేసిన పంత్‌పై ట్రోల్స్

|

Aug 07, 2024 | 6:39 PM

SL vs IND 3rd ODI Rishabh Pant Trolled by Fans: రిషబ్ పంత్ పేలవమైన వికెట్ కీపింగ్ కోసం ట్రోల్ చేయబడింది: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ (SL vs IND) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అయితే, గత రెండు వన్డేలో చోటు దక్కని రిషబ్ పంత్.. మూడో వన్డేలో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తన పేలవమైన వికెట్ కీపింగ్ కారణంగా అభిమానుల లక్ష్యానికి గురైయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Video: పేరుకే ధోని శిష్యుడివి.. కీపర్‌గా గల్లీ ప్లేయర్‌వి.. స్టైల్‌కు పోయి స్టంపింగ్ మిస్ చేసిన పంత్‌పై ట్రోల్స్
Rishabh Pant Stump Miss Video
Follow us on

SL vs IND 3rd ODI Rishabh Pant Trolled by Fans: రిషబ్ పంత్ పేలవమైన వికెట్ కీపింగ్ కోసం ట్రోల్ చేయబడింది: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ (SL vs IND) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. అయితే, గత రెండు వన్డేలో చోటు దక్కని రిషబ్ పంత్.. మూడో వన్డేలో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తన పేలవమైన వికెట్ కీపింగ్ కారణంగా అభిమానుల లక్ష్యానికి గురైయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. స్టంపింగ్ చేయడంలో జాప్యం చేయడంతో మహేష్ తీక్షణ సేవ్ అయ్యాడు.

పంత్ తన స్టైల్ స్టంపింగ్ కారణంగా మహేష్ తీక్షణను స్టంప్ చేసే చాలా సులభమైన అవకాశాన్ని కోల్పోయాడు. నెటిజన్లు ధోనితో పోల్చుతూ ఏకిపారేస్తున్నారు. పేరుకే ధోని శిష్యుడివని, వికెట్ కీపింగ్‌లో మాత్రం గల్లీ క్రికెటర్‌వి అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు.

మ్యాచ్ గురించి మాట్లాడితే..

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్‌కు 249 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అవిష్క ఫెర్నాండో 96 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు కుసాల్ మెండిస్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, పాతుమ్ నిస్సంక 45 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు.

శ్రీలంక : చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (కీపర్), సదీర సమరవిక్రమ, జెనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహిష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే.

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..