Shubman Gill : కేవలం అడుగు దూరంలో రికార్డ్ ఛాన్స్.. సౌతాఫ్రికా సిరీసులో విరాట్, సచిన్ క్లబ్‌లో చేరనున్న శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఈ సంవత్సరం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ ఒక అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఈ యువ ఓపెనర్ కేవలం 272 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు మాత్రమే సాధించిన ఒక ప్రత్యేకమైన క్లబ్‌లో చేరతాడు.

Shubman Gill : కేవలం అడుగు దూరంలో రికార్డ్ ఛాన్స్.. సౌతాఫ్రికా సిరీసులో విరాట్, సచిన్ క్లబ్‌లో చేరనున్న శుభ్‌మన్ గిల్
Shubman Gill (1)

Updated on: Nov 13, 2025 | 7:02 AM

Shubman Gill : భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఈ సంవత్సరం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ ఒక అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ఈ యువ ఓపెనర్ కేవలం 272 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు మాత్రమే సాధించిన ఒక ప్రత్యేకమైన క్లబ్‌లో చేరతాడు.

భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా శుభ్‌మన్ గిల్ ఒక పెద్ద రికార్డును 2దుకునే అవకాశం ఉంది. 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేయడానికి గిల్‌కు కేవలం 272 పరుగులు మాత్రమే అవసరం. ఈ 272 పరుగులు సాధించడంతో పాటు, అతను ఈ రెండు టెస్టుల్లో కూడా ఒక్కసారి కూడా డకౌట్ (సున్నా పరుగులకు అవుట్) కాకుండా ఉంటే, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో డకౌట్ కాకుండా 2000 అంతర్జాతీయ పరుగులు చేసిన నాల్గవ భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఫీట్‌ను ఇంతవరకు కేవలం ముగ్గురు దిగ్గజాలు మాత్రమే సాధించారు. 2016 సంవత్సరంలో డకౌట్ కాకుండా 2595 పరుగులు చేసి, ఈ రికార్డులో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1998 సంవత్సరంలో సున్నాకు అవుట్ కాకుండా 2541 పరుగులు సాధించారు. రాహుల్ ద్రవిడ్ 2002 సంవత్సరంలో డకౌట్ కాకుండా 2270 పరుగులు చేశారు.

శుభ్‌మన్ గిల్ 2025లో మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సున్నాకు అవుట్ కాలేదు అనేది అతి పెద్ద విశేషం. శుభ్మన్ గిల్ మొత్తం 31 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 38 ఇన్నింగ్స్‌లు ఆడి 1728 పరుగులు సాధించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లలో 15 ఇన్నింగ్స్‌లు ఆడి, 979 పరుగులు చేశాడు. అతని యావరేజ్ అద్భుతంగా 69.92 గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్‌లో అతని నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. ఈ ఫార్మాట్‌లో తను 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

వన్డే ఫార్మాట్‌లో 11 మ్యాచ్‌లలో 49 పరుగులు చేశాడు. అతని సగటు 9.00 గా ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని ప్రదర్శన టెస్ట్ తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. టీ20 ఫార్మాట్‌లో 12 మ్యాచ్‌లలో 259 పరుగులు చేశాడు. అతని సగటు 21.58 గా ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను ఎటువంటి సెంచరీలు, హాఫ్ సెంచరీలను నమోదు చేయలేదు. టీ20 క్రికెట్ లో అతని ప్రదర్శన మధ్యస్తంగా ఉంది.

మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 31 మ్యాచ్‌లలో (38 ఇన్నింగ్స్‌లు) 1728 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి గిల్ మొత్తం 7 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. గిల్ అత్యధిక పరుగులు టెస్ట్ ఫార్మాట్‌లో సాధించాడు. అతని అత్యధిక టెస్ట్ స్కోర్ 269 పరుగులుగా ఉంది. ఈ సిరీస్‌లో గిల్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తే, అతను ఈ ఏడాదిని మరచిపోలేనిదిగా ముగించవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..