Gill vs Sara: గిల్, సారా మధ్య పోలికలు ఇవే.. ఆ ఐదింటిలో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా..?

Shubman Gill and Sara Tendulkar Net Worth: శుభ్మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య రిలేషన్‌షిప్ గురించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, వీరిద్దరి గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, వీరి మధ్య ఉన్న 5 కీలక తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Gill vs Sara: గిల్, సారా మధ్య పోలికలు ఇవే.. ఆ ఐదింటిలో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా..?
Sara And Gill

Updated on: Jul 13, 2025 | 1:54 PM

Shubman Gill and Sara Tendulkar Comparision: లండన్‌లో యువరాజ్ సింగ్ పార్టీలో కనిపించినప్పటి నుంచి శుభ్‌మాన్ గిల్, సారా టెండూల్కర్ వార్తల్లో ఉంటున్నారు. క్యాన్సర్ ఫౌండేషన్ ‘యూవీకాన్’ కోసం నిర్వహించిన విందులో వీరిద్దరి కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. అయితే, ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, వీరికి సంబంధించిన 5 కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శుభ్మన్ గిల్, సారా టెండూల్కర్ గురించి 5 వాస్తవాలు..

శుభమన్ గిల్, సారా టెండూల్కర్‌లకు సంబంధించిన ఈ 5 వాస్తవాలు వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో గిల్, సారా వయస్సు, వృత్తి, విద్య, ఇద్దరి ఎత్తుతోపాటు సంపదకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..

1. ముందుగా వయస్సు గురించి మాట్లాడుకుందాం. శుభ్‌మాన్ గిల్ సారా టెండూల్కర్ కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. శుభ్‌మాన్ గిల్ వయసు 25 సంవత్సరాలు కాగా, సారా టెండూల్కర్ వయసు 27 సంవత్సరాలు.

2. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సారా టెండూల్కర్, శుభ్‌మాన్ గిల్ ఏం చేస్తారు? ప్రపంచానికి శుభ్‌మాన్ గిల్ గురించి తెలుసు. అతను ఒక క్రికెటర్. టీమిండియా కెప్టెన్ కూడా. ఇక సారా టెండూల్కర్ గురించి మాట్లాడుకుంటే, మోడల్‌గా ఉండటమే కాకుండా, ఆమె తన తండ్రి సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తుంది.

3. సారా టెండూల్కర్, శుభ్‌మాన్ గిల్ విద్యలో చాలా తేడా ఉంది. గిల్ కేవలం 10వ తరగతి మాత్రమే చేశాడు. అలాగే, సారా టెండూల్కర్ క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ కోర్సులో ఎంఏ చేసింది.

4. శుభ్‌మాన్ గిల్ ఎత్తు 6 అడుగులు, సారా టెండూల్కర్ ఎత్తు 5 అడుగులు 4 అంగుళాలు. ఇది కాకుండా, ఇద్దరి నికర విలువ మధ్య చాలా అంతరం ఉంది.

5. శుభ్‌మాన్ గిల్ నెట్ వర్త్ సారా టెండూల్కర్ కంటే దాదాపు రూ.75 కోట్లు ఎక్కువ. శుభ్‌మాన్ గిల్ నికర విలువ రూ.76.5 కోట్లు కాగా, సారా టెండూల్కర్ నికర విలువ రూ.1 కోటి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..