నవంబర్ 24న జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు, ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2024-25లో గోవాపై 47 బంతుల్లో సెంచరీ శ్రేయాస్ అయ్యర్ చేశాడు. ముంబై కెప్టెన్ అయ్యర్ రెండవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి త్వరితగతిన సెంచరీ చేసాడు. 130(57) పరుగులు చేయగా,11 ఫోర్లు, 10 సిక్స్‌లు కొట్టాడు. వరుసగా పృథ్వీ షా, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీ చేశారు. ముంబై 4 వికెట్లకు 250 పరుగులు చేసింది. తిలక్ వర్మ T20 ఫార్మాట్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. హైదరాబాద్ vs మేఘాలయ SMAT 2024-25 మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు .
అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లోని ఫార్మాట్‌లలో అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇటీవల ఒడిశాపై శ్రేయాస్ అయ్యర్ డబుల్ సెంచరీ (233), రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై ఒక సెంచరీ (142) చేశాడు. కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ వ్యవహరించి IPL టైటిల్‌ను సాధించి పెట్టాడు. అయితే కేకేఆర్ అతని రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్ IPL వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్ళలో ఒకరిగా మారాడు. కెప్టెన్ మెటీరియల్ కోసం కొన్ని జట్లు వెతుకుతున్నాయి. దీంతో శ్రేయాస్ అయ్యర్ కోసం వేలంలో జట్లు పోటి పడుతాయని తెలుస్తుంది.
Century for shreyas Iyer one day before ipl auction 🟣 pic.twitter.com/QgmHfjwaMB
— THE KNIGHT RIDERS EXTRA (@KNIGHTS_EXTRA) November 23, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు శ్రేయాస్ అయ్యర్ కోసం భారీగా వేలం వేయవచ్చు. ఈ జట్లకు కొత్త కెప్టెన్లు అవసరం. పంజాబ్ కింగ్స్ ఇటీవల రికీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. రికీ పాంటింగ్ మరియు శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ జట్టు కోసం కలిసి పనిచేశారు. కాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టు కూడా శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేయవచ్చు.