New Zealand Canceled Pakistan Tour: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆఖరి క్షణంలో పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చింది. భద్రతా వైపల్యాలను కారణంగా చూపి వైట్ బాల్ సిరీస్‌ను రద్దు చేసింది. అంతా సజావుగా జరిగితే ఈ రోజునుంచి రావల్పిండిలో వన్డే మ్యాచ్‌లు మొదలయ్యేవి. ఈ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ తో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిఉంది. ఇప్పుడు అనుకోకుండా పర్యటన రద్దు కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షాక్‌కి గురైంది. తీవ్ర నిరాశలో మునిగింది.
ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఈ సిరీస్‌కి ఆది నుంచి ఆటంకాలు మొదలయ్యాయి. మొదటగా రెండు జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు గాయలపాలయ్యారు. తర్వాత ఐపీఎల్ వల్ల ఈ సిరీస్‌కి DRS Sistem ( Decision Review System ) సిస్టమ్ అందుబాటులో లేదు. ఇప్పుడు భద్రత కారణంగా సిరీస్ రద్దు చేశారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో విధంగా చెబుతున్నారు. ఇతర విజిటింగ్ టీమ్‌ల మాదిరిగానే న్యూజిలాండ్‌కు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. షెడ్యూల్ చేసిన మ్యాచ్‌లను కొనసాగించడానికి PCB ఇప్పటికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఈ సిరీస్ రద్దు చేయడంతో పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారన్నారు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మాట్లాడుతూ.. మిలియన్ల మంది పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు చిరునవ్వులు తిరిగి తెచ్చే ఈ సిరీస్ రద్దు కావడంతో అందరు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నాడు. మా సెక్యూరిటీ ఏజెన్సీల సామర్థ్యాలు విశ్వసనీయతపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు. 2009 లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడుల తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ని దేశంలో తిరిగి పునరుద్ధరించడానికి PCB విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటన రద్దు వచ్చే నెలలో ఇంగ్లాండ్ సిరీస్‌పై కూడా ప్రభావం చూపవచ్చు.
The BLACKCAPS are abandoning their tour of Pakistan following a New Zealand government security alert.
Arrangements are now being made for the team’s departure.
More information | https://t.co/Lkgg6mAsfu
— BLACKCAPS (@BLACKCAPS) September 17, 2021