Shane Warne: స్వదేశం చేరుకున్న షేన్‌ వార్న్‌ పార్థీవ దేహం.. లక్షమంది అభిమానుల సమక్షంలో ఆరోజునే అంత్యక్రియలు..

|

Mar 11, 2022 | 12:36 PM

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి వారం రోజులు గడిచిపోయాయి. అయితే ఇప్పటికీ అతని హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Shane Warne: స్వదేశం చేరుకున్న షేన్‌ వార్న్‌ పార్థీవ దేహం.. లక్షమంది అభిమానుల సమక్షంలో ఆరోజునే అంత్యక్రియలు..
Shane Warne
Follow us on

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్ వార్న్ (Shane Warne) ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి వారం రోజులు గడిచిపోయాయి. అయితే ఇప్పటికీ అతని హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత శుక్రవారం (మార్చి4) థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో అచేతనంగా పడిపోయిన వార్న్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైందని వార్న్‌ గుండెపోటుతో చనిపోయారని వైద్యులు తెలిపారు. ఇక ఆతర్వాత పోలీసుల ప్రాథమిక విచారణ, పోస్ట్‌మార్టం అంటూ ఇన్ని రోజులు థాయ్‌లోనే ఉన్న వార్న్‌ పార్థీవ దేహం ఆస్ట్రేలియాకు చేరింది. గురువారం ఉదయం బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టునుంచి ఓ ప్రత్యేక విమానంలో వార్న్‌ మృతదేహాన్ని ఆస్ట్రేలియా జాతీయ పతకంతో కప్పి మెల్‌బోర్న్‌కు తరలించారు. కాగా వార్న్‌ గదిలో రక్తపు మరకలు ఉండడంతో అతని మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో వార్న్‌ది సహజమరణమేనని వైద్యులు ధ్రువీకరించారు.

లక్షలాది మంది అభిమానుల సమక్షంలో…
కాగా వార్న్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. క్రికెట్‌ పరంగా వార్న్‌కు ఎన్నో మైలురాళ్లు, మధురానుభూతులు అందించిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం (ఎంసీజీ)లోనే అతని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వార్న్‌కు నివాళులు అర్పించేందుకు సుమారు లక్షమంది అభిమానులు హాజరుకానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టికెట్లను జారీచేస్తున్నట్లు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా వార్న్‌ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వాపోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న అతను వార్న్‌ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానన్నాడు. వార్న్‌ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంసీజీలో జరిగే తన అంత్యక్రియలకు విక్టోరియా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. నేను కూడా ఆ అంత్యక్రియలకు హాజరయేందుకు ప్రయత్నిస్తాను’ అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: Post Office Net Banking: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా.. ఇలా నెట్‌ బ్యాంకింగ్‌ యాక్టివేట్‌ చేసుకోండి..!

VH Comments: అలా చేయడం వల్లే ఇలా జరుగుతోంది.. వీహెచ్ సంచలన కామెంట్స్

Nandamuri Balakrishna: ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే.. కోపం తగ్గించుకోమని.. ఐదు సింపుల్ టిప్స్ చెప్పిన బాలయ్య