U-19 T20 World Cup: 57 బంతుల్లో 92 రన్స్‌.. టీ20 మ్యాచ్‌లో ఏకంగా 20 ఫోర్లు.. 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బౌలర్ల ఊచకోత

|

Jan 14, 2023 | 9:54 PM

57 బంతుల్లో 92 రన్స్‌.. ఇందులో ఏకంగా 20 ఫోర్లు.. అంటే 80 పరుగులు కేవలం బౌండరీల ద్వారా వచ్చినవే.. మ్యాచ్‌ మొత్తం మీద స్ట్రైక్‌ రేటు 161.40.. ఇది అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో శ్వేతా సెహ్రావత్‌ చెలరేగిన తీరు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించింది టీమిండియా అమ్మాయి.

U-19 T20 World Cup: 57 బంతుల్లో 92 రన్స్‌.. టీ20 మ్యాచ్‌లో ఏకంగా 20 ఫోర్లు.. 160కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బౌలర్ల ఊచకోత
Shweta Sehrawat
Follow us on

57 బంతుల్లో 92 రన్స్‌.. ఇందులో ఏకంగా 20 ఫోర్లు.. అంటే 80 పరుగులు కేవలం బౌండరీల ద్వారా వచ్చినవే.. మ్యాచ్‌ మొత్తం మీద స్ట్రైక్‌ రేటు 161.40.. ఇది అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో శ్వేతా సెహ్రావత్‌ చెలరేగిన తీరు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించింది టీమిండియా అమ్మాయి. 167 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆరంభం నుంచే విరుచుకు పడింది శ్వేత. సింగిల్స్‌, డబుల్స్‌ కంటే బౌండరీలే కొట్టడమే ఆమెకు సులభమనిపించిందేమో. ఏకంగా 20 ఫోర్లు కొట్టి టీమిండియాను సులభంగా విజయ తీరాలకు చేర్చింది. తద్వారా ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియాకు మొదటి గెలుపును అందించింది. అందుకే తన తుపాను ఇన్నింగ్స్‌కు గుర్తుగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం కూడా గెల్చుకుందామె. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడింది టీమిండియా.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ సేమర్ లారెన్స్ శుభారంభం అందించింది. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 పరుగులు చేసింది. వీరితో పాటు మిడిలార్డర్‌లో మాడిసన్ లాండ్స్‌మన్ (32), కరాబో మాసియో (19), మియానే స్మిత్ (16) వేగంగా పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిలు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా శ్వేతా సెహ్రావత్‌ వరుస బౌండరీలో విరుచుకుపడింది. మరో ఓపెనర్‌ షెఫాలీ వర్మ 16 బంతుల్లో 45 ( 9 ఫోర్లు, సిక్సర్‌) కలిసి పవర్‌ ప్లేలోనే 70 పరుగులు జోడించారు. షెఫాలీ ఔటైనా గొంగిడి త్రిష (15), సౌమ్య తివారి (10), సోనియా (1 నాటౌట్‌) సహకారంతో ఇంకా 21 బంతులు మిగిలి ఉండగానే టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..