WTC Final: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయం తెలిసిందే. నిరంతరాయంగా కురుస్తోన్న వర్షం కారణంగా క్రికెట్ అభిమానుల్లో నిరాశ ఏర్పడింది. వర్షం కారణంగా తొలి, నాలుగో రోజు ఆట అసలు ప్రారంభంకాలేదు. ఇలాగే కొనసాగితే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నో ఆశలతో ఉన్న అభిమానులు ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇలాంటి పపరిస్థితులు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సౌథాంప్టన్ వాతావరణం పట్ల ఏ మాత్రం అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ రూపొందించిన నిబంధనలు అంచనాలు తప్పాయని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సేహ్వాగ్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటూ తనదైన శైలిలో ట్వీట్లు చేసే సెహ్వాగ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌పై కూడా స్పందించారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేస్తూ.. `బ్యాట్స్‌మెన్లకే కాదు.. ఐసీసీకి కూడా టైమ్ లేకుండా పోయింది` అంటూ తనదైన శైలిలో స్పందించారు. మరి ఈ మ్యాచ్ ఎలాంటి మలుపుతిరుగుతుందో చూడాలి.
Batsman ko bhi Timing nahi mili dhang ki, aur ICC ko bhi#WTCFinal
— Virender Sehwag (@virendersehwag) June 21, 2021
ఇదిలా ఉంటే.. సౌథాంప్టన్ వేదికగా కివీస్-భారత్ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు కూడా ఆలస్యంగా మొదలైంది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా మారడం వల్ల మ్యాచ్ అనుకున్న సమయానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్, కెప్టెన్ విలియమ్సన్ ఉన్నారు.
Also Read: IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఒక గంట ఆలస్యం.. మొదలైన ఐదో రోజు ఆట
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ఇలా మీరెప్పుడూ చూసుండరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!