Viral Video : అబ్బా జర్రుంటే చచ్చిపోతుంటివి గదరా.. బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!

Viral Video : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‎లో ఆదివారం ఒక భయానక దృశ్యం కనిపించింది. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకరికొకరు అనుకోకుండా ఎదురెదురుగా దూసుకువచ్చారు.

Viral Video : అబ్బా జర్రుంటే చచ్చిపోతుంటివి గదరా.. బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
Bbl 2025

Updated on: Dec 28, 2025 | 7:20 PM

Viral Video : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‎లో ఆదివారం ఒక భయానక దృశ్యం కనిపించింది. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే క్యాచ్ కోసం ఇద్దరు ఫీల్డర్లు ఒకరికొకరు ఎదురెదురుగా దూసుకువచ్చారు. పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్, ఆస్ట్రేలియా ప్లేయర్ హిల్టన్ కార్ట్‌రైట్ తలలు పగిలేంత ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మైదానంలో అసలేం జరిగిందంటే..

సిడ్నీ థండర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఘటన జరిగింది. టామ్ కరన్ వేసిన బంతిని బ్యాటర్ గాల్లోకి లేపాడు. అది బ్యాక్ వర్డ్ పాయింట్, డీప్ పాయింట్ మధ్యలో పడబోయింది. ఆ క్యాచ్‌ను అందుకోవడానికి పాయింట్‌లో ఉన్న హారిస్ రౌఫ్ వెనక్కి పరిగెత్తగా, బౌండరీ దగ్గర ఉన్న కార్ట్‌రైట్ ముందుకు దూసుకువచ్చాడు. ఇద్దరూ కేవలం బంతిపైనే కళ్లు పెట్టి వేగంగా ఎదురెదురుగా రావడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. ఇద్దరూ ఒకేసారి క్యాచ్ కోసం డైవ్ చేయబోయారు.

సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు

సరిగ్గా డైవ్ చేసే క్షణంలో కార్ట్‌రైట్ అప్రమత్తమయ్యాడు. హారిస్ రౌఫ్ తన వైపే వస్తున్నాడని గమనించి, చివరి సెకనులో తన డైవ్‌ను పక్కకు మళ్లించాడు. లేదంటే ఇద్దరి తలలు బలంగా ఢీకొనేవి. క్యాచ్ అయితే మిస్ అయ్యింది కానీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఆటగాళ్లు క్యాచ్‌ను అందుకోవడంలో చూపే అత్యుత్సాహం ఒక్కోసారి కెరీర్‌కే ముప్పు తెస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

హారిస్ రౌఫ్ సూపర్ స్పెల్

ప్రమాదం తప్పినప్పటికీ, అంతకుముందు హారిస్ రౌఫ్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రౌఫ్ నిప్పులు చెరిగే బంతులకు సిడ్నీ థండర్ బ్యాటర్లు విలవిలలాడారు. రౌఫ్ 3 వికెట్లు పడగొట్టి సిడ్నీని 128 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్లు జో క్లార్క్ (60), గ్లెన్ మాక్స్‌వెల్ (39) రెచ్చిపోవడంతో మెల్బోర్న్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రౌఫ్ తన స్పీడ్ తో మ్యాచును మలుపు తిప్పాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..