వరల్డ్ కప్ 2019: ఇండియా వెర్సస్ ఫాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆవలించండంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలవడంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది. నెటిజన్లయితే దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు.
విమర్శల దాడి పెరుగుతుండటంతో సర్ఫరాజ్ స్పందించాడు. ‘నేను కేవలం ఆవలించాను. ఇది ఎవరికైనా సహజంగా జరిగే విషయమే. ఇదేం నేరం కాదు.. నేను నేరం చేయలేదు’ అని అన్నాడు. తన ఆవలింత ఫొటోను ట్రోల్ చేస్తూ, యాడ్స్ తీస్తూ డబ్బు సంపాదిస్తున్నారని తెలిసిందని.. తన వల్ల కొందరికి మంచే జరగడం సంతోషమేనని అన్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను నియంత్రించడం కష్టమన్న సర్ఫరాజ్.. ఏది పడితే అది రాసిపారేస్తున్నారని..దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పాడు.
Sarfaraz Ahmed “yawning is a normal thing to do, I didn’t commit a sin. If people made money out of me yawning, that’s a good thing” #CWC19 pic.twitter.com/aicexVuneP
— Saj Sadiq (@Saj_PakPassion) June 22, 2019