సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ గత ఏడాది ఐపీఎల్ ఫైనల్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. రాజస్థాన్ జట్టు ఫైనల్స్‌కు చేరడం ఇది రెండోసారి. అంతకుముందు ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ ఫైనల్‌కు చేరి టైటిల్ కూడా గెలుచుకుంది. IPL-2023లో ఈ జట్టు మళ్లీ ఫైనల్ ఆడేందుకు ప్రయత్నిస్తుంది. టైటిల్‌ను కూడా గెలుచుకోవాలని కోరుకుంటోంది. దీని కోసం తన పదునైన బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన ఆటగాడిని తన జట్టులో చేర్చుకుంది. రాజస్థాన్ తన జట్టులో సందీప్ శర్మను చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.
గత సీజన్‌లో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రసీద్ధ్ కృష్ణ ఈ సీజన్‌లో గాయపడటంతో ఐపీఎల్-2023లో ఆడడం లేదు. అతని స్థానంలో రాజస్థాన్ టీం సందీప్‌ను జత చేసింది. సందీప్ చేరడం గురించి ఫ్రాంచైజీ సోమవారం ట్వీట్ ద్వారా తెలియజేసింది.
సందీప్ ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున మాత్రమే ఐపీఎల్ ఆడాడు. రాజస్థాన్ అతని మూడో జట్టు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌కి ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు విరాట్ కోహ్లీని అవుట్ చేసిన బౌలర్‌గా పేరుగాంచాడు. ఇప్పటికి ఏడుసార్లు ఐపీఎల్‌లో కోహ్లీని బలిపశువుగా చేసుకున్నాడు. అంతే కాకుండా ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ బౌలర్ ఐపీఎల్ పవర్‌ప్లేలో మొత్తం 53 వికెట్లు తీశాడు. 54 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ అతని కంటే ముందున్నాడు. భువనేశ్వర్, సందీప్ కలిసి హైదరాబాద్ తరపున ఆడారు.
Okay then, making this official. ?? https://t.co/FAjBB6808I pic.twitter.com/Rf3ZwI0bSH
— Rajasthan Royals (@rajasthanroyals) March 27, 2023
IPL-2023 వేలంలో సందీప్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. అతని బేస్ ధర రూ. 50 లక్షలు. కానీ, అతను ఇప్పుడు IPLలోకి ప్రవేశించాడు. రూ.10 కోట్ల విలువైన ఆటగాడిని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణను ఐపీఎల్-2022 వేలంలో రాజస్థాన్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను కాలికి గాయం కారణంగా ఈ సీజన్‌లో ఆడడంలేడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..