IND Vs AUS: కోహ్లీతో జరిగిన వివాదంపై స్పందించిన సామ్ కాన్‌స్టాస్.. తనకు నేను పెద్ద వీరాభిమానినంటూ..

|

Dec 27, 2024 | 3:41 PM

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు సామ్ కాన్‌స్టాస్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సామ్ కాన్‌స్టాస్‌ల మధ్య తీవ్ర వివాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సామ్ కాన్‌స్టాస్ స్పందించాడు. ఇందులో విరాట్ కోహ్లీ తప్పు ఏమి లేదని తేల్చి చెప్పేశారు.

IND Vs AUS: కోహ్లీతో జరిగిన వివాదంపై స్పందించిన సామ్ కాన్‌స్టాస్.. తనకు నేను పెద్ద వీరాభిమానినంటూ..
Sam Konstas Reacts On Clash With Virat Kohli In Boxing Day Test Match
Follow us on

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ ఈరోజు ప్రారంభమైంది. బాక్సింగ్ డే రోజున మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే ఈ మ్యాచ్‌లో అందరీ దృష్టి  19వ డెబ్యూ ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్‌పైనే ఉంది. ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేసిన 19 ఏళ్ల ఓపెనర్ సామ్ కాన్‌స్టంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచి హాఫ్ సెంచరీ చేశాడు. భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనవసరంగా కాన్‌స్టంట్స్‌తో వివాదం పెట్టుకున్నాడు. ఈ వివాదంపై ఐసీసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి విరాట్‌పై చర్యలు కూడా తీసుకుంది. ఈ ఘటనపై మ్యాచ్ అయిపోయిన తర్వాత సామ్ కాన్‌స్టంట్స్ స్పందించాడు. ఇందులో విరాట్ తప్పు ఏమిలేదని, అతను ఉద్దేశపూర్వకంగా ఏమి చేయలేదని సామ్ కాన్‌స్టంట్స్ తెలిపాడు.

ఈ సిరీస్‌లోప్రతి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే సామ్ కాన్స్టాంట్స్ విరుచుకుపడ్డాడు. బుమ్రా బౌలింగ్లో సిక్స్ బాది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాన్‌స్టంట్స్ తన బ్యాటింగ్‌తో భారత జట్టును ఇబ్బంది పెడుతుండగా, ఒక ఓవర్ తర్వాత, కోహ్లి ఉద్దేశపూర్వకంగా అతని భుజంను తగిలాడు. కాన్‌స్టాంట్స్ కూడా అతడిని ఢీకొట్టి కోహ్లీ చర్యలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అయితే, ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, అంపైర్ కూడా జోక్యం చేసుకుని మైదానంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ చర్య తర్వాత, మొత్తం ఆస్ట్రేలియా మీడియా, వ్యాఖ్యాతలు, అభిమానులు కోహ్లీపై విరుచుకుపడ్డారు. అతనిపై విమర్శలతో దాడి చేశారు. మ్యాచ్ రిఫరీ కూడా కోహ్లి చర్యను గ్రహించి అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం తగ్గించి అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించాడు.

మరోవైపు కాన్స్టాస్ కూడా ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. “నేను నా చేతి గ్లౌస్ సరిచేసుకుంటూ ఉన్న సమయంలో బహుశా విరాట్ అనుకోకుండా వచ్చి నన్ను ఢీకొట్టి ఉండవచ్చు. ఇదంతా క్రికెట్‌లో జరుగుతుందని నేను భావిస్తున్నాన”  అని ఆయన చెప్పుకొచ్చాడు.

కాన్‌స్టంట్స్ మొదటి నుండి కోహ్లీకి పెద్ద అభిమాని. విరాట్‌ను తన ఆరాధ్యదైవంగా భావిస్తాడు. కొద్ది రోజుల క్రితం, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కాన్‌స్టాన్స్ తన మొదటి సెంచరీని సాధించినప్పుడు, కేవలం 3 మంది నుండి అభినందన సందేశాలు రావడం తనకు కల సాకారం అవుతుందని చెప్పాడు. ఈ ముగ్గురిలో, ఒకరు అతని తండ్రి, రెండవది కాన్స్టాన్స్ మెంటర్ షేన్ వాట్సన్, అతను తీసుకున్న మూడవ పేరు కోహ్లీ. అంతేకాదు కోహ్లీని తన ఫేవరెట్ బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి