Sachin vs Virat: వన్డే కెరీర్ తొలి 5 ఏళ్లలో సచిన్ ‘జీరో’ సెంచరీలు.. మరి విరాట్ కోహ్లీ ఎన్నో చేశాడో తెలుసా?

Sachin vs Virat: వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో సచిన్ టెండూల్కర్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అదే సమయంలో విరాట్ కోహ్లీ 13 సెంచరీలు సాధించాడు.  సచిన్ శకం వేరు, కోహ్లీ శకం వేరు అయినప్పటికీ ఇద్దరూ భారత క్రికెట్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. 

Sachin vs Virat: వన్డే కెరీర్ తొలి 5 ఏళ్లలో సచిన్ ‘జీరో’ సెంచరీలు.. మరి విరాట్ కోహ్లీ  ఎన్నో చేశాడో తెలుసా?
Sachin Tendulkar Vs Virat Kohli

Updated on: Sep 02, 2026 | 3:32 PM

Sachin vs Virat: భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్‌లో సచిన్ డకౌట్‌గా వెనుతిరిగారు. ఆ తర్వాత నుంచి ఏకంగా ఐదేళ్ల పాటు అంటే 1989, 1990, 1991, 1992, 1993 సంవత్సరాల్లో ఒక్క వన్డే సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. మూడంకెల స్కోరు సాధించడానికి సచిన్ చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది.

సచిన్ తన వన్డే కెరీర్‌లోని 76వ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీ సాధించి సెంచరీల ఖాతాను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా సచిన్ రికార్డుల వేట మొదలుపెట్టారు. తన కెరీర్ పూర్తయ్యే సమయానికి వన్డేల్లో ఏకంగా 49 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్ మొత్తంలో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.

సచిన్ వన్డే కెరీర్ తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోతే, విరాట్ కోహ్లీ మాత్రం అదే సమయంలో విధ్వంసం సృష్టించాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ తన తొలి ఐదేళ్లలోనే ఏకంగా 13 వన్డే సెంచరీలు బాదేశాడు. తొలి ఏడాది 2008లో సెంచరీ చేయకపోయినప్పటికీ 2009లో ఒకటి, 2010లో మూడు, 2011లో నాలుగు, 2012 నాటికి ఐదు సెంచరీలు సాధించి రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు.

సచిన్ నెలకొల్పిన 49 వన్డే సెంచరీల రికార్డు సుమారు 11 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2023 నవంబర్‌లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన 50వ వన్డే సెంచరీ సాధించి సచిన్ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 54 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వ్యాప్తంగా కోహ్లీ ఖాతాలో ఇప్పుడు 85 సెంచరీలు ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us