Video: సచిన్ నుంచి రోహిత్.. రోహిత్ నుంచి అర్జున్.. సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. ఎందుకో తెలుసా?

Arjun Tendulkar: ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ తన ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్-11లో భాగంగా ఉన్నాడు. విశేషమేమిటంటే..

Video: సచిన్ నుంచి రోహిత్.. రోహిత్ నుంచి అర్జున్.. సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. ఎందుకో తెలుసా?
Arjun Tendulkar 4

Updated on: Apr 16, 2023 | 5:12 PM

ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ తన ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో వాంఖడేలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్-11లో భాగంగా ఉన్నాడు. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో అతనే తొలి ఓవర్‌ బౌలింగ్ చేశాడు. తన తొలి ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. గత రెండు సీజన్లలో, అతను ప్లేయింగ్-11లో చేరడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఈరోజు (ఏప్రిల్ 16) తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. మ్యాచ్‌లో టాస్‌కు ముందు రోహిత్ శర్మ అతనికి ఐపీఎల్ అరంగేట్రం క్యాప్ అందించాడు. అర్జున్‌కి ఈ డెబ్యూ క్యాప్ వచ్చిన వెంటనే, అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాడు. అందరూ అర్జున్ కి ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సచిన్ నుంచి రోహిత్, రోహిత్ నుంచి అర్జున్..

కాగా, అభిమానులు మరో అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రోహిత్ శర్మ అరంగేట్రంలో సచిన నుంచి డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. అలాగే నేడు అర్జున్ టెండూల్కర్ టీమిండియా సారథి రోహిత్ శర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు. సర్కిల్ ఆఫ్ లైఫ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..