దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్ వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. అయితే, ఈ గేమ్‌లో హార్దిక్ పాండ్యా టీంమేట్ అద్భుతమైన క్యాచ్ అందుకుని షాక్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. క్యాచ్ కోసం గాలిలో చేసిన స్టంట్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను క్యాచ్ తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ వీడియోపై అభిమానులు కామెంట్ చేస్తూ.. ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్ అదిరిందంటున్నారు. ఐపీఎల్‌లో రషీద్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు.
రషీద్ ఖాన్ క్యాచింగ్ వైబ్స్ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్‌కు ఈ క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే బంతి చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఈ క్యాచ్ పట్టుకునేందుకు గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బాడీని బ్యాలెన్స్ చేస్తూ, అందుకున్నాడు.
అయితే, అఫ్గానిస్థాన్ వెటరన్ స్పిన్నర్ ఈ బంతిని భూమికి కొన్ని అంగుళాల ఎత్తులో ఒడిసి పట్టుకున్నాడు. ఈ సమయంలో నేలకు చేయి నేలకు తగలకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అయితే క్యాచ్ పట్టినా అతడి జట్టు భారీ ఓటమితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్‌ల్లో ఎంఐ కేప్‌టౌన్ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ప్రిటోరియస్ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ తరహాలో, ఈ లీగ్ టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే ఈ టీ20 సిరీస్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..