SA vs AUS Match Report: ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో టైటిల్ పోరు..

|

Nov 16, 2023 | 10:20 PM

ICC World Cup Match Report, South Africa vs Australia: కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా సాగింది. కానీ, స్కోర్ బోర్డ్‌పై చాలా తక్కువ స్కోర్ ఉండడంతో సౌతాఫ్రికా చివరి వరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 213 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

SA vs AUS Match Report: ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. టీమిండియాతో టైటిల్ పోరు..
Australia Squad
Follow us on

ICC World Cup Match Report, South Africa vs Australia: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు 8వ సారి ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా మరోసారి పెద్ద టోర్నమెంట్ చోకర్స్ జట్టుగా నిరూపించుకుంది. వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్టు సెమీఫైనల్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి.

గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ అత్యధికంగా 101 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ తలో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 213 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయంతో నవంబర్ 19న జరిగే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది.

ఇరుజట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయడి