
Ryan ten Doeschate Critiques Nitish Kumar Reddy: రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా, కీలక ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టెన్ డోషేట్ మాట్లాడుతూ నితీష్ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. “మేం నితీష్‌ను ఒక మంచి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని నిరంతరం చర్చిస్తున్నాం. అతనికి తగినంత గేమ్ టైమ్ (ఆడే అవకాశం) ఇస్తున్నాం. కానీ, అవకాశం వచ్చినప్పుడు అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు” అని పేర్కొన్నాడు.
రెండో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి వికెట్ తీయకుండా 13 పరుగులు ఇచ్చాడు.
క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించే అవకాశం ఉన్నా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నప్పుడు కనీసం ఐదు నుంచి ఆరు ఓవర్లు వేసి వికెట్లు తీయాల్సి ఉంటుంది, కానీ కెప్టెన్ అతనికి ఎక్కువ ఓవర్లు ఇచ్చే సాహసం చేయలేదు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీష్‌ను సిద్ధం చేయాలని బోర్డు భావించింది. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా అతను తన నైపుణ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని డోషేట్ గుర్తు చేస్తూ, “జట్టులో చోటు సంపాదించాలంటే వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలి. కానీ నితీష్ విషయంలో అది జరగడం లేదు” అని బాహాటంగానే విమర్శించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..