RR vs DC Highlights: మూడోసారి ఓడిన ఢిల్లీ.. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం..

|

Apr 08, 2023 | 7:24 PM

Rajasthan Royals vs Delhi Capitals IPL 2023 Highlights in Telugu: ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 200 పరుగులు టార్గెట్ నిలిచింది.

RR vs DC Highlights: మూడోసారి ఓడిన ఢిల్లీ.. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం..
Dc Vs Rr

RR vs DC Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 11వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముచ్చటగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. రాజస్థాన్ రాయల్స్ అందించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో భాగంగా గౌహతిలోని బార్‌స్పరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 11వ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 200 పరుగులు టార్గెట్ నిలిచింది. 17వ అర్ధ సెంచరీ చేసిన తర్వాత బట్లర్ (79 పరుగులు) ఔటయ్యాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఆయనకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హెట్‌మెయర్‌తో కలిసి బట్లర్ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు రియాన్ పరాగ్ 7 పరుగుల వద్ద, కెప్టెన్ సంజూ శాంసన్ సున్నా, యశస్వి జైస్వాల్ 60 పరుగుల వద్ద ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, కుల్దీప్, పోవెల్ తలో ఒక వికెట్ పడగొట్టారు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ముంబైలో రాత్రి 7:30 గంటల నుంచి జరగనుంది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 Apr 2023 06:56 PM (IST)

    15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ డేవిడ్ వార్నర్, రోవ్‌మన్ పావెల్ ఉన్నారు. వార్నర్ 57వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • 08 Apr 2023 06:36 PM (IST)

    12 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ క్రీజులో ఉన్నారు. ఐపీఎల్‌లో వార్నర్ 6000 పరుగులు పూర్తి చేశాడు. అతను 165 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్థానాన్ని సాధించాడు. విరాట్ కోహ్లి (188 ఇన్నింగ్స్)ను వార్నర్ వెనక్కునెట్టాడు.

  • 08 Apr 2023 06:19 PM (IST)

    9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్..

    ఢిల్లీ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ క్రీజులో ఉన్నారు.

  • 08 Apr 2023 06:06 PM (IST)

    మూడు వికెట్లు డౌన్..

    ఢిల్లీ 6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్ క్రీజులో ఉన్నారు. 14 పరుగుల వద్ద రిలే రస్సో అవుటయ్యాడు. మనీష్ పాండే 0 పరుగుల వద్ద, పృథ్వీ షా 0 పరుగుల వద్ద ఔటయ్యారు.

  • 08 Apr 2023 05:44 PM (IST)

    తొలి ఓవర్లోనే ఢిల్లీకి షాక్..

    ఢిల్లీ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, రిలే రస్సో క్రీజులో ఉన్నారు.

    మనీష్ పాండే ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అతను ట్రెట్ బౌల్ట్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. అంతకుముందు వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతిలో పృథ్వీ షా క్యాచ్ ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు.

  • 08 Apr 2023 05:15 PM (IST)

    RR vs DC Live Updates: ఢిల్లీ ముందు భారీ టార్గెట్..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్‌లో భాగంగా గౌహతిలోని బార్‌స్పరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 11వ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 199 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 200 పరుగులు టార్గెట్ నిలిచింది. 17వ అర్ధ సెంచరీ చేసిన తర్వాత బట్లర్ (79 పరుగులు) ఔటయ్యాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఆయనకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హెట్‌మెయర్‌తో కలిసి బట్లర్ 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు రియాన్ పరాగ్ 7 పరుగుల వద్ద, కెప్టెన్ సంజూ శాంసన్ సున్నా, యశస్వి జైస్వాల్ 60 పరుగుల వద్ద ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, కుల్దీప్, పోవెల్ తలో ఒక వికెట్ పడగొట్టారు.

  • 08 Apr 2023 04:59 PM (IST)

    భారీ స్కోర్ దిశగా రాజస్థాన్..

    రాజస్థాన్ 16 ఓవర్లలో మూడు వికెట్లకు 143 పరుగులు చేసింది. జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్ క్రీజులో ఉన్నారు. బట్లర్ కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

  • 08 Apr 2023 04:39 PM (IST)

    బట్లర్ హాఫ్ సెంచరీ..

    రాజస్థాన్ 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. జోస్ బట్లర్, రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నారు. బట్లర్ కెరీర్‌లో 17వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ సున్నా వద్ద ఔటయ్యాడు. అతను ఎన్రిక్ నోర్త్యా చేతికి చిక్కాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (60 పరుగులు)ను ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు.

  • 08 Apr 2023 04:25 PM (IST)

    RR vs DC Live Updates: తొలి వికెట్ డౌన్..

    రాజస్థాన్ ఓపెనర్ జైస్వాల్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 98 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 08 Apr 2023 04:15 PM (IST)

    జైస్వాల్ హాఫ్ సెంచరీ..

    రాజస్థాన్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఈ లీగ్‌లో జైస్వాల్ 5వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 25 బంతుల్లో 11 ఫోర్లతో 200 స్ట్రైక్ రేట్‌తో దంచి కొట్టాడు.

  • 08 Apr 2023 04:03 PM (IST)

    RR vs DC Live Updates: పవర్ ప్లేలో దంచికొట్టిన రాజస్థాన్ ఓపెనర్స్..

    రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 41, జోస్ బట్లర్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 08 Apr 2023 03:59 PM (IST)

    హాఫ్ సెంచరీకి చేరువైన జైస్వాల్..

    రాజస్థాన్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 40, జోస్ బట్లర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 08 Apr 2023 03:48 PM (IST)

    ఫోర్లతో దుమ్మురేపుతోన్న ఓపెనర్స్..

    రాజస్థాన్ 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 22, జోస్ బట్లర్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 08 Apr 2023 03:38 PM (IST)

    జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్..

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే జైస్వాల్ దమ్కీ ఇచ్చాడు. ఖలీల్ బౌలింగ్‌లో 5 ఫోర్లు బాదేశాడు.

  • 08 Apr 2023 03:34 PM (IST)

    తొలి విజయం కోసం ఢిల్లీ ఎదురుచూపులు..

    ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఇది మూడో మ్యాచ్. ఆ జట్టు రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురు చూస్తుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీని లక్నో సూపర్‌జెయింట్స్‌ 50 పరుగుల తేడాతో ఓడించగా, రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

  • 08 Apr 2023 03:15 PM (IST)

    RR vs DC Live Updates: రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI..

    రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్, కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

  • 08 Apr 2023 03:14 PM (IST)

    RR vs DC Live Updates: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI..

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.

  • 08 Apr 2023 03:12 PM (IST)

    RR vs DC Live Updates: టాస్ గెలిచిన ఢిల్లీ..

    గత మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వేలికి గాయమైంది. అందుకే ఢిల్లీతో ఆడటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, టాస్ తర్వాత ప్లేయింగ్ 11లో బట్లర్ చేర్చారు.

Follow us on