ఐపీఎల్-2022లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ రెండు జట్లు బ్రబౌర్న్ స్టేడియంలో తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ ఇప్పటికే ప్లేఆఫ్‌కు వెళ్లింది. రాయల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే నం.2కి చేరి ఫైనల్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలను పొందుతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నైకి ఇది ఈ సీజన్‌లో చివరి మ్యాచ్.
జట్ల అంచనా
రాజస్థాన్ రాయల్స్: జైస్వాల్, జోస్ బట్లర్, సంజుశాంసన్, పడిక్కల్, హెట్మెయర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, మెక్‌య్.
చెన్నై సూపర్ కింగ్స్: గైక్వాడ్, కాన్‌వే, ఉతప్ప, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, ధోనీ, సంట్నర్, సోలంకి, పతిరన, ముకేష్ చౌదరి.
ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్. రెండు బాల్స్ మిగులుండగానే మ్యాచ్ పూర్తి చేసిన రాజస్థాన్
వరుస వికెట్లు కోల్పోతున్న రాజస్థాన్ రాయల్స్.. స్కోర్ 112 /5
105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. జైస్వాల్ 59 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు
14 ఓవర్లకు రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులకు చేరుకుంది.
76 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. పడికల్ (3) అవుట్ అయ్యాడు.
సంజు సాంసన్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ .. 15 పరుగుల వద్ద సంజు అవుట్.. స్కోర్ 73/2
రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ ఔటయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ధోని 26 పరుగులు చేయగా.. మిగతా వారు స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. చాహల్, మెక్‌య్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 93 పరుగులు చేసిన మొయిన్ అలీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో ఎంఎస్ ధోని ఔటయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన అంబటి రాయుడు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
చెన్నై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. క్రీజులో మొయిన్ అలీ 70 పరుగులు, అంబటి రాయుడు 3 పరుగులతో ఆడుతున్నారు.
చెన్నై మూడో వికెట్‌కోల్పోయింది. జగదీష్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో చెన్నై 8.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.
చెన్నై రెండో వికెట్‌కోల్పోయింది. కాన్‌వాయ్ 16 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో చెన్నై 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
మొయిన్ అలీ రికార్డ్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 19 బంతుల్లోనే రికార్డు అర్ధశతకం నమోదు చేశాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన మొయిన్ అలీ.. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌ను ఉతికేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో గైక్వాడ్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.