IPL 2026: ఐపీఎల్ 2026 ముందే RCB చాప్టర్ క్లోజ్.! అసలు మ్యాటర్ ఇదే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంలో మార్పు.. జట్టు పేరు మార్పుకు దారితీస్తుందనే భయం అభిమానుల్లో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ అనే పేరును.. మాజీ యజమాని విజయ్ మాల్యా పెట్టాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

IPL 2026: ఐపీఎల్ 2026 ముందే RCB చాప్టర్ క్లోజ్.! అసలు మ్యాటర్ ఇదే
Rcb Team

Updated on: Nov 17, 2025 | 6:04 PM

ఐపీఎల్ ఫ్రాంచైజీ మారిందంటే.. కచ్చితంగా జట్టు పేరు కూడా మారిపోతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇటీవల RCB ఫర్ సేల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సో.! యాజమాన్యం మారితే.. 18 ఏళ్లుగా వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు కూడా మారిపోతుందని టెన్షన్ పడుతున్నారు RCB ఫ్యాన్స్. ఎందుకంటే గతంలోనూ డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ మారడంతో.. ఆ జట్టు పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా మారింది.

అయితే ప్రస్తుత RCB యజమాని డియాజియో.. ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టినా.. కోర్ బ్రాండ్ నేమ్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ, లోగోకు ఉన్న బ్రాండింగ్ అంతా ఇంతా కాదు. అందుకే పేరు మార్చకుడదని అనుకుంటున్నారట. ‘అవును.! RCB అమ్మకానికి ఉంది. కానీ దాని పేరు మారదు. ఈ పుకార్లను ఎవరు వ్యాప్తి చేస్తున్నారు.? ఇది పూర్తిగా అవాస్తవం.! RCB సంస్థకు దాని ట్రేడ్‌మార్క్‌తో సహా దాని స్వంత ఆస్తులు ఉన్నాయి. కాబట్టి, డియాజియో నుంచి RCBని కొనుగోలు చేసే ఎవరైనా దాని ట్రేడ్‌మార్క్‌ను కూడా కొనుగోలు చేస్తారు.’ అని అర్సీబీ అఫీషియల్ ఒకరు తెలిపారు. కాగా, మార్చి 31, 2026 నాటికి ఆర్సీబీ అమ్మకం పూర్తవుతుందని భావిస్తున్నారు. అదార్ పూనవల్లా, పార్థ్ జిందాల్, హోంబలే ఫిలిమ్స్ ఈ రేసులో ఉన్నారని టాక్.