WPL 2024, RCB vs MI: హర్మన్‌ప్రీత్ కౌర్ vs స్మృతి మంధాన.. కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్లు..

Royal Challengers Bangalore Women vs Mumbai Indians Women: మహిళల ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది.

WPL 2024, RCB vs MI: హర్మన్‌ప్రీత్ కౌర్ vs స్మృతి మంధాన.. కీలక పోరుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్లు..
Wpl 2024 Rcb Vs Mi 9th Matc
Follow us

|

Updated on: Mar 02, 2024 | 8:57 AM

Womens Premier League 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024) 9వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే గత మ్యాచ్‌ల్లో ఇరు జట్లూ ఓడిపోయాయి. ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ విజయాల బాట పట్టేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. వరుసగా రెండు విజయాలతో అద్భుత ప్రదర్శన చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత మ్యాచ్‌లో ఓడిపోయింది. అలాగే బలమైన శక్తిగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు అనివార్యం.

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది. అందుకే ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు రానుంది.

ఇవి కూడా చదవండి

సారథులుగా టీమిండియా ప్లేయర్లు..

రెండు జట్లకు భారత ఆటగాళ్లు నాయకత్వం వహించడం విశేషం. అంటే టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారనుంది.

రెండు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో పైచేయి ఎవరిదంటే..

WPL 2023లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అందుకే నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి విజయం ఖాతా తెరవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది.

రెండు జట్లు:

ముంబై ఇండియన్స్ (MI) జట్టు: అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసాబెల్లె వాంగ్, జింటిమణి కలిత, నటాలీ స్కివర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బవట్ల, సైకా ఇషాక్ , యస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజ్నా, అమన్‌దీప్ కౌర్, ఫాతిమా జాఫర్, కీర్తనా బాలకృష్ణన్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు: ఆశా శోబన, దిశా కసత్, ఎల్లిస్ పెర్రీ, హీథర్ నైట్, ఇంద్రాణి రాయ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, రాంకా పాటిల్, స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, ఏక్తా బిష్త్ , కేట్ క్రాస్, శుభా సతీష్, సిమ్రాన్ బహదూర్, సబ్బినేని మేఘన, సోఫీ మోలినెక్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..