సచిన్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్.. అదేంటో తెలుసా?
TV9 Telugu
23 September 2024
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ క్రమంలో రెండో టెస్ట్ ఇరుజట్ల మధ్య సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఈ టెస్ట్ కూడా గెలిస్తే, డబ్ల్యూటీసీలో పటిష్ట స్థితికి చేరుకుంటుంది. మరోవైపు పోరాడాలని బంగ్లా చూస్తోంది.
ఈ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యేకం. ఈ విజయంతో రోహిత్ ప్రత్యేక జాబితాలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
టీమిండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది.
టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా తరపున మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 307 మ్యాచ్‌లు గెలిచాడు.
చెన్నై సచిన్‌ను అధిగమించిన రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం 308 మ్యాచ్‌ల విజయాల్లో భాగమయ్యాడు.
టీమిండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 322 విజయాల్లో భాగమయ్యాడు.
ఇప్పటివరకు టీమిండియా 35 టెస్టులు, 164 వన్డేలు, 102 టీ20 విజయాల్లో రోహిత్ శర్మ భాగమయ్యాడు.