చెన్నైలో సెప్టెంబర్ గోడను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ..

TV9 Telugu

22 September 2024

టెస్ట్ రోహిత్ శర్మ నాయకత్వంలో, చెన్నై టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

బంగ్లాదేశ్‌పై విజయంతో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. సెప్టెంబరులో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన మొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ అద్బుత రికార్డ్ లిఖించాడు.

భారత్ తన తొలి టెస్టును 1934లో చెన్నైలో ఆడింది. అప్పటి నుంచి, చెన్నైలో 35 టెస్టులు జరిగాయి. ఇందులో సెప్టెంబర్‌లో 4 మ్యాచ్‌లు జరిగాయి. 

సెప్టెంబరులో చెన్నైలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌గా మారింది. ఇందులో విజయంతో రోహిత్ ఖుషీ అయ్యాడు.

సెప్టెంబరులో బంగ్లాదేశ్‌పై చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇప్పటి వరకు విజయం సాధించలే. కానీ రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆ అడ్డుగోడను బ్రేక్ చేసింది. 

ఇంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. మొదటి 2 టెస్టులు డ్రా కాగా, 1 టై అయింది. 

1986 తర్వాత సెప్టెంబర్‌లో చెన్నైలో టెస్టు మ్యాచ్ ఆడింది. దీంతో 38 ఏళ్ల తర్వాత స్పెషల్ రికార్డ్ నమైదైంది.

ఈ విజయంతో ఆ జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.