RCB vs MI: నేడే ‘ఐపీఎల్ హైఓల్టేజ్ మ్యాచ్‌’.. మైదానంలో తపపడనున్న కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్..

|

Apr 02, 2023 | 10:32 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, ముంబై మధ్య జరిగే నేటి మ్యాచ్ అభిమానులలో ఉత్కంఠ రేపింది. చిన్నస్వామి స్టేడియంలోని అన్ని టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది ఖచ్చితంగా..

RCB vs MI: నేడే ‘ఐపీఎల్ హైఓల్టేజ్ మ్యాచ్‌’..  మైదానంలో తపపడనున్న కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్..
ఆదివారం బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ అజేయంగా చేసిన 82 పరుగులు చాలా కీలకమని చెప్పుకోవాలి.
Follow us on

ఐపీఎల్ సీజన్ 16‌లో భాగంగా హైవోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. అవును ఈ రోజు రాత్రి 7.30 నిముషాలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, ముంబై మధ్య జరిగే నేటి మ్యాచ్ అభిమానులలో ఉత్కంఠ రేపింది. చిన్నస్వామి స్టేడియంలోని అన్ని టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది ఖచ్చితంగా హైఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ‘హిట్ మ్యాన్ వర్సెస్ రన్ మిషిన్’ పరిస్థితి ఉంది. ఇక గత ఆరు నెలలుగా భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపై అందరి దృష్టి ఉంది. కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ RCB ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ ఐపీఎల్ 16వ సీజన్‌ని ప్రారంభిస్తున్న బెంగళూరు టీమ్‌లో  గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.

అయితే ముంబై తరఫున కూడా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు ఫిట్‌గా ఉండడం ముంబైకి  కొండంత బలంగా ఉంది. మరి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఎలా ఉందా అంటే ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఇక ముంబై తరఫున టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, కెమరూన్ గ్రీన్ బ్యాటింగ్ విభాగానికి బలం. ఫాస్టర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ విభాగంలో కన్నేశాడు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా జట్టుకు ఉపయోగకరమైన సహకారం అందించగలడు. ఇక గత సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరగా, ముంబై ఘోరంగా విఫలమైంది. కానీ హిట్ మ్యాన్‌ నాయకత్వంలోనే ముంబై 5 సార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే..

 

తుది జట్టు.. (అంచనా)

RCB ప్లేయింగ్ XI : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, మైకేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్,  ఆకాష్ దీప్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:  రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, రమణదీప్ సింగ్, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, సందీప్ వారియర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..