IPL 2022: ఆర్‌సీబీకి కొత్త హెడ్ కోచ్‌ దొరికాడు.. ధోనీ బ్యాటింగ్ ప్లేస్‌ మార్చి వివాదాల్లో చిక్కిన ఆయన ఎవరంటే?

|

Nov 09, 2021 | 1:19 PM

Royal Challengers Bangalore: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన కోచింగ్ స్టాఫ్‌లో ఓ భారీ మార్పు చేసింది.

IPL 2022: ఆర్‌సీబీకి కొత్త హెడ్ కోచ్‌ దొరికాడు.. ధోనీ బ్యాటింగ్ ప్లేస్‌ మార్చి వివాదాల్లో చిక్కిన ఆయన ఎవరంటే?
Ipl 2022 Royal Challengers Bangalore
Follow us on

Royal Challengers Bangalore: టీ20 ప్రపంచ కప్ 2021లో భారత జట్టు ప్రయాణం ముగియడంతో ఐసీఎల్ 2021 (IPL 2022) గురించి ఉత్కంఠ మరింత పెరిగింది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్రధాన కోచ్ పేరును ప్రకటించింది. ఆర్‌సీబీ తదుపరి ప్రధాన కోచ్‌గా సంజయ్ బంగర్ నియమితులు కానున్నారు. అతను ఇప్పటివరకు జట్టుకి బ్యాటింగ్ సలహాదారుగా ఉన్నాడు. ఇప్పటికే గత సీజన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. మైక్ హెస్సన్ నుంచి ప్రధాన కోచ్ బాధ్యతలను బంగర్ స్వీకరించనున్నాడు. హెస్సన్ ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. అతను ఐపీఎల్ 2021 సమయంలో ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించాడు.

అతను ఐపీఎల్‌లో ముందు పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. 2014 నుంచి 2016 వరకు పంజాబ్ కింగ్స్‌ తరపున పనిచేశాడు. సంజయ్ బంగర్ భారత బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు. 2014 నుంచి 2019 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆయన స్థానంలో విక్రమ్ రాథోర్‌ని నియమించారు. 2019 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయంపై చాలా వివాదం నెలకొంది. ఈ నిర్ణయం సంజయ్ బంగర్ దేనని చెప్పుకొచ్చారు. టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి అతడిని తొలగించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఇది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయమని బంగర్ తరువాత తెలిపాడు.

ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. తొలి ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుచుకోవాలనే కలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ‘ఇంత పెద్ద ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద అవకాశం. నేను జట్టులోని అత్యంత అద్భుతమైన, ప్రతిభావంతులైన కొంతమంది సభ్యులతో కలిసి పనిచేశాను. ఈ బృందాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చేయాల్సింది చాలా ఉంది. కానీ, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్‌తో మేం బాగా పనిచేసి అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయిస్తాం’ అని తెలిపాడు.

బంగర్ భారత్ తరఫున టెస్టు-వన్డేలు ఆడాడు..
సంజయ్ బంగర్ ఆటగాడిగా ఆల్ రౌండర్‌గా ఆడాడు. భారత్ తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 650 పరుగులు చేసి 14 వికెట్లు తీశాడు. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్‌లో, అతను ఫస్ట్ క్లాస్‌లో 300, లిస్ట్ ఏలో 92, టీ20లో 31 వికెట్లు తీశాడు. అతను ఐపీఎల్‌లో కూడా ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లలో భాగమయ్యాడు.

Also Read: T20 World Cup 2021: టాస్ ఓడినా, గెలిచినా.. మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇవ్వాల్సిందే: విరాట్ కోహ్లీ

Ravi Shastri Sign Off Speech: బరువెక్కిన హృదయంతో హెడ్ కోచ్ రవిశాస్త్రి చివరి సందేశం.. ఏమన్నాడంటే?