Royal Challengers Bangalore: ఆర్‌సీబీ ఆ ఇద్దరిని రిటైన్ చేసుకుంటుందా.. ఎవరు వారు..

|

Nov 25, 2021 | 9:00 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లకు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నవంబర్ 30 వరకు సమయం ఉంది...

Royal Challengers Bangalore: ఆర్‌సీబీ ఆ ఇద్దరిని రిటైన్ చేసుకుంటుందా.. ఎవరు వారు..
Rcb
Follow us on

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వచ్చే ఏడాది మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రిటైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లకు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నవంబర్ 30 వరకు సమయం ఉంది. ఈ జట్లు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అవకాశం ఉంది. రిటైన్ చేసుకునే పేర్లలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లును చేర్చవచ్చు. రాబోయే IPL వేలంలో జట్లకు రూ. 90 కోట్ల పర్స్ ఉంటుంది.

రెండు కొత్త ఫ్రాంచైజీలు – లక్నో, అహ్మదాబాద్, రిటెన్షన్‌లు ముగిసిన తర్వాత వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చని ఈఎస్పీఎన్ క్రిక్‎న్ఫో నివేదిక పేర్కొంది. ఈ రెండు జట్ల కలయికలో ఇద్దరు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు ఉంటారు. IPL 2021 ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అన్ని క్రికెట్ ఫార్మట్ల నుండి ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. అతను భవిష్యత్తులో కూడా బాగా ఆడతాడని భావిస్తున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2021లో RCB తరఫున స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. అతను 513 పరుగులతో ఈ సీజన్‌లో పరుగుల్లో 5వ స్థానంలో నిలిచాడు. సమర్థవంతమైన ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం.

Read Also.. IND vs NZ: శుభ్‎మన్ గిల్‎కు మంచి భవిష్యత్తు ఉంది.. టెస్ట్ క్రికెట్‌లో అతడు కీలకంగా ఉంటాడు..