Video: ‘ప్లీజ్ మహీ.. బెంగళూరు కోసం ఒక్క ట్రోఫీ గెలిపించవా’.. ఆర్‌సీబీ ఫ్యాన్ కోరికకు ధోని ఫన్నీ సమాధానం..

|

Dec 21, 2023 | 11:39 AM

RCB: అయితే, అభిమానులు ఎంతగానో ఇష్టపడే IPL జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అయితే, ఈ క్రమంలో ఒక ఆర్‌సీబీ అభిమాని ఎంఎస్ ధోనీని బెంగుళూరు జట్టు ట్రోఫీని గెలవడానికి సహాయం చేయమని కోరాడు. దానికి CSK కెప్టెన్ చాలా 'తెలివిగా' సమాధానం చెప్పుకొచ్చాడు.

Video: ప్లీజ్ మహీ.. బెంగళూరు కోసం ఒక్క ట్రోఫీ గెలిపించవా.. ఆర్‌సీబీ ఫ్యాన్ కోరికకు ధోని ఫన్నీ సమాధానం..
Ms Dhoni Question Rcb Fan
Follow us on

RCB Fan Demand To MS Dhoni: ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్‌లో అంటే 2023లో IPL టైటిల్‌ను గెలుచుకుంది. చెన్నై జట్టు మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. అయితే, అభిమానులు ఎంతగానో ఇష్టపడే IPL జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కూడా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. అయితే, ఈ క్రమంలో ఒక ఆర్‌సీబీ అభిమాని ఎంఎస్ ధోనీని బెంగుళూరు జట్టు ట్రోఫీని గెలవడానికి సహాయం చేయమని కోరాడు. దానికి CSK కెప్టెన్ చాలా ‘తెలివిగా’ సమాధానం చెప్పుకొచ్చాడు.

బెంగుళూరు జట్టు ట్రోఫీని గెలవడానికి RCB అభిమాని మహితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఆర్‌సీబీ అభిమాని ఎంఎస్ ధోనితో మాట్లాడుతూ, “నేను 16 సంవత్సరాలుగా ఆర్‌సీబీకి అభిమానిగా ఉన్నాను. మీరు CSK కోసం ఐదు టైటిళ్లు గెలిచినట్లే, మాకోసం RCBకి మద్దతు వచ్చి ఓ ట్రోఫీని గెలవాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు. దీంతో అక్కడున్న జనాలంతా నవ్వుకున్నారు.

ఆర్‌సీబీ అభిమాని ప్రశ్నకు ధోనీ సమాధానమిస్తూ.. ‘వాళ్లది చాలా మంచి టీమ్. కానీ, క్రికెట్‌లో అన్నీ ప్లాన్‌ ప్రకారం జరగవు. అందుకే మొత్తం 10 టీమ్‌లు పూర్తి ఆటగాళ్లను కలిగి ఉంటే అవి చాలా బలమైన జట్లే. కానీ, గాయం లేదా మరేమైనా కారణంగా కొంతమంది ఆటగాళ్లను కోల్పోయితే, సమస్య అక్కడే ప్రారంభమవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

“వాళ్లది చాలా మంచి జట్టు. ప్రతి ఒక్కరికి ఐపీఎల్‌లో మంచిగా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను నా స్వంత జట్టు గురించే ఆలోచిస్తున్నాను. కాబట్టి, ప్రతి జట్టుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా, నేను పెద్దగా చేయలేను. ఎందుకంటే నేను మరొక జట్టుకు సహాయం చేయడానికి వస్తే మా అభిమానులు ఎలా భావిస్తారో ఊహించుకోండి” అంటూ ఫన్నీగా సమాధానమిచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..