న్యూజిలాండ్(New Zealand) క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన రాస్ టేలర్(Ross Taylor) తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. హామిల్టన్‌లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడో వన్డే.. అతని అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్. టేలర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో గ్రౌండ్‌లోకి వస్తున్నప్పుడు బాధగా ఉన్నట్లు కనిపించాడు. జాతీయ గీతాలాపన సందర్భంగా టేలర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సమయంలో అతనితోపాటు సహచరులతో పాటు, అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. న్యూజిలాండ్ జట్టు తన గత సిరీస్‌లో రాస్ టేలర్‌కు విజయాన్ని బహుమతిగా అందించింది. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో కివీస్ 2-0 ఆధిక్యంలో ఉంది.
న్యూజిలాండ్ తరఫున గత 15 ఏళ్లుగా మ్యాచ్‌లు ఆడుతున్న రాస్ టేలర్.. ఇప్పటి వరకూ 445 మ్యాచ్‌లాడి 18,074 పరుగులు చేశాడు. అలానే న్యూజిలాండ్ తరఫున 100కి పైగా టెస్టులాడిన నాలుగో ప్లేయర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకూ 110 టెస్టులాడిన టేలర్.. 7584 పరుగులు చేశాడు. కివీస్ తరఫున డేనియల్ వెటోరీ (112), స్టీఫెన్ ప్లెమింగ్ (111), బ్రెండన్ మెక్‌కలమ్ (101) మాత్రమే 100కిపైగా టెస్టులు ఆడారు.
15 ఏళ్ల కెరీర్‌లో 110 టెస్టులు, 233 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లాడిన రాస్ టేలర్.. 40 సెంచరీలు నమోదు చేశాడు.
Read Also.. IPL 2022: ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొస్తున్న ఆటగాళ్లు.. టాప్ 5లోకి దూబే, లివింగ్‌స్టోన్..