
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా బుధవారం (డిసెంబర్ 24, 2025) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న రోహిత్, తన రాకను ఘనంగా చాటుకుంటూ కేవలం 62 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించాడు.
సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, మొదటి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్లు, క్లాసిక్ కవర్ డ్రైవ్‌లతో స్టేడియంలోని ప్రేక్షకులను అలరించాడు.
38 years young.
Still opening the batting.
Still scoring daddy hundreds.
Still ruling the 50-over format like it’s his backyard.
The longevity of the Hitman is unreal. 🫡🇮🇳#RohitSharma #TeamIndia #Cricket #ODIGOAT pic.twitter.com/wLWNUJQOtr— GLOBAL CRICKET NEWS (@globcricket) December 24, 2025
మెరుపు హాఫ్ సెంచరీ: కేవలం 28 బంతుల్లోనే రోహిత్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
వేగవంతమైన సెంచరీ: అటు తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ‘హిట్‌మ్యాన్’.. 62 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.
విజయం దిశగా ముంబై : రోహిత్ ధాటికి ముంబై జట్టు కేవలం 12 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసి, లక్ష్యం వైపు దూసుకెళ్లింది. రోహిత్‌కు తోడుగా యువ బ్యాటర్ అంగ్రిష్ రఘువంశీ నిలకడగా ఆడాడు.
2018 తర్వాత రోహిత్ ఆడుతున్న మొదటి విజయ్ హజారే మ్యాచ్ కావడంతో సుమారు 10,000 మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సి ఉండటంతో రోహిత్ ఈ టోర్నీలో భాగమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు సానుకూల అంశం.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. సిక్కిం బ్యాటర్ ఆశిష్ థాపా (79 పరుగులు) అద్భుత పోరాటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ముంబై బౌలర్లలో కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..