Rohit Sharma: 17 ఏళ్ళ తరువాత టైటిల్ ఇచ్చాడు.. కట్ చేస్తే ఇప్పుడు కెప్టెన్సీ కోసం..

|

Jan 13, 2025 | 9:24 PM

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, మరికొన్ని నెలల పాటు కెప్టెన్‌గా కొనసాగాలని బీసీసీఐని కోరారు. జస్ప్రీత్ బుమ్రా తరువాతి కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశముండగా, అతని గాయాలు ప్రధాన సమస్యగా మారాయి. రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ వైస్-కెప్టెన్సీకి ప్రతిపాదితులుగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకవచ్చని సమాచారం.

Rohit Sharma: 17 ఏళ్ళ తరువాత టైటిల్ ఇచ్చాడు.. కట్ చేస్తే ఇప్పుడు కెప్టెన్సీ కోసం..
Rohit
Follow us on

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, తన అంతర్జాతీయ కెరీర్ ముగింపు సమీపంలో ఉండడంతో, మరికొన్ని నెలల పాటు కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో రోహిత్ తన మనసులోని మాటను వెల్లడించి, తన తర్వాతి వారసుడి ఎంపికలో జాగ్రత్తగా ముందుకెళ్లాలని సూచించారు.

ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా పేరు టెస్ట్, వన్డే కెప్టెన్సీ కోసం ప్రధాన అభ్యర్థిగా వినిపిస్తోంది. అయితే, అతని గాయాల కారణంగా సెలక్టర్లు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బుమ్రాకు తోడుగా సమర్థులైన వైస్-కెప్టెన్సీ ఎంపికలపై చర్చలు జరుగుతున్నాయి. వాటిల్లో రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ పేర్లు కూడా ఉన్నాయి వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, రోహిత్ తన కెరీర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ముగించే అవకాశముందని అంటున్నారు. అయితే, బుమ్రా పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే ముందు బోర్డు కొన్ని సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుంది. టెస్ట్, వన్డే కెప్టెన్సీకి వేర్వేరు కెప్టెన్లను కోరడం లేదని బీసీసీఐ స్పష్టతనిచ్చింది.

ఈ పరిణామాలు చూస్తే, రోహిత్ కెప్టెన్సీ కాలం ముగింపు భారత్ క్రికెట్‌లో కొత్త శకానికి నాంది కావచ్చని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..