Rohit Sharma: దేవుడితో ఏం మాట్లాడతామంటూ అభిమాని భావోద్వేగం.. ఫిదా అయిన రోహిత్ శర్మ.. బహుమతిగా ఏమిచ్చాడంటే?

|

Sep 24, 2021 | 3:28 PM

అబితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కేబీసీ షో వీడియో కాల్‌లో తన అభిమానిని ఆశ్చర్యపరిచాడు మన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఆయనకు ఓ బహుమతిని కూడా పంపాడు.

Rohit Sharma: దేవుడితో ఏం మాట్లాడతామంటూ అభిమాని భావోద్వేగం.. ఫిదా అయిన రోహిత్ శర్మ.. బహుమతిగా ఏమిచ్చాడంటే?
Rohit Sharma On Kbc Video Call
Follow us on

KBC Show: ఈ సీజన్‌లో కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌కి భారతదేశానికి చెందిన పలువురు క్రికెట్, ఇతర క్రీడా ప్రముఖులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన ఒక ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్‌కు నిజంగా ఆశ్చర్యం కలిగించారు కేబీసీ వ్యాఖ్యత అమితాబ్ బచ్చన్. ఎందుకంటే రోహిత్ శర్మ అభిమాని హాట్ సీటుపై కూర్చుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పున్నాడు. అలాంటి సమయంలో టీమిండియా, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మతో ఆయనను మాట్లాడించారు.

సౌరవ్ గంగూలీ-వీరేంద్ర సెహ్వాగ్, నీరజ్ చోప్రా-పిఆర్ శ్రీజేష్ జోడీలు కేబీసీలో ప్రేక్షకులకు ఆనందాన్ని అందించారు. వీరంతా కేబీసీ రియాలిటీ క్విజ్ షోలో ఇప్పటికే పోటీదారులుగా పాల్గొన్నారు.

అయితే గురువారం జరిగిన షోలో ప్రాంశు అనే పోటీదారుడు హాట్ సీట్‌పై కూర్చుని గేమ్ ఆడుతున్నాడు. భారత క్రికెటర్ రోహిత్ శర్మపై తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. వాస్తవానికి, హోస్ట్ అమితాబ్ బచ్చన్ ఓ ప్రశ్నను అడిగాడు. అయితే దానికి సమాధానం చెప్పడంలో తికమక పడుతోన్న ప్రాంశుకి ఓ అఫ్షన్ కూడా ఇచ్చాడు. సహాయం కోసం అతని స్నేహితురాలు లేదా రోహిత్ శర్మలలో ఎవరిని ఎన్నుకుంటావని అడిగారు. దానికి ప్రాంశు ఇది ప్రశ్న కంటే చాలా కఠినమైనదంటూ చెప్పుకొచ్చాడు.

అయితే రోహిత్ పట్ల ప్రాంశుకి ఉన్న స్వచ్ఛమైన అభిమానానికి ఫిదా అయిన బిగ్ బి.. ఇద్దరి మధ్య వీడియో కాల్ ఏర్పాటు చేశాడు. రోహిత్ తన కళ్ల ముందు పెద్ద తెరపై కనిపించడంతో, ప్రాంశు తన కళ్లను నమ్మలేకపోయాడు. భావోద్వేగానికి గురయ్యాడు. హిట్‌మ్యాన్‌తో మాట్లాడటానికి ప్రాంశు వద్ద మాటలు కూడా లేవు.

ప్రాంశు తన సీటు నుంచి లేచి రోహిత్‌కు నమస్కరించాడు. రోహిత్‌తో మాట్లాడమని మిస్టర్ బచ్చన్ ప్రాంశుని కోరాడు. దానికి “దేవుడితో ఎవరు మాట్లాడుతారు?” అని ప్రాంశు భావోద్వేగానికి గురయ్యాడు.

ఈ ఎపిసోడ్ గురువారం ప్రసారమైంది. కాగా, రోహిత్ శర్మ తన అభిమానికి తన సంతకం చేసిన గ్లోవ్స్‌ను అందించాడు. కేబీసీలో ఇదో అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈమేరకు ఈ వీడియోను తెగ వైరల్ చేశారు.

Also Read: IPL 2021: తొలి రెండు మ్యాచుల్లో బౌండరీల భీభత్సం.. కోహ్లీ, రోహిత్‌లకు చుక్కలు.. 26న ధోని టీంకు దబిడ దిబిడే అంటోన్న గంగూలీ శిష్యుడు

కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!