
Viral Video : భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరు? అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు ఎంఎస్ ధోనీ లేదా రిషబ్ పంత్. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వీరెవరినీ కాదని ఒక ఆసక్తికరమైన పేరును తెరపైకి తెచ్చాడు. వికెట్ వెనుక మెరుపు వేగంతో కదిలే నైపుణ్యం విషయంలో వృద్ధిమాన్ సాహాకు సాటివచ్చే కీపర్ దేశంలోనే లేడని రోహిత్ కుండబద్దలు కొట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సాహాపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
రోహిత్ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో ధోనీ, పంత్, సాహా వంటి హేమాహేమీలతో కలిసి ఆడాడు. అయితే, ప్యూర్ వికెట్ కీపింగ్ స్కిల్స్ విషయానికి వస్తే సాహానే అసలైన విజేత అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. “నేను స్లిప్ కార్డన్‌లో నిలబడి సాహాతో కలిసి ఎన్నో టెస్ట్ మ్యాచ్‌లు ఆడాను. నా పక్కన ఉన్న అతను అసాధ్యమైన క్యాచ్‌లను కూడా ఎంతో సులువుగా పట్టడం చూశాను. వికెట్ కీపింగ్‌లో సాహా లాంటి ఆటగాడిని నేను నా జీవితంలో చూడలేదు. అతను ఇండియాలోనే బెస్ట్ కీపర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు” అని రోహిత్ స్పష్టం చేశాడు.
ముఖ్యంగా భారత్‌లో ఉండే స్పిన్ వికెట్లపై కీపింగ్ చేయడం కత్తి మీద సాము లాంటిదని రోహిత్ గుర్తు చేశాడు. “రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి టాప్ స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపింగ్ చేయడం చాలా కష్టం. జడేజా బంతిని చాలా వేగంగా విసురుతాడు, అశ్విన్ ఎప్పుడు క్యారమ్ బాల్ వేస్తాడో ఎవరికీ అర్థం కాదు. అశ్విన్ వేసే బంతి ఒక్కోసారి అతడికే తెలియదు.. కానీ సాహా మాత్రం వాటిని ఎంతో ఏకాగ్రతతో అందుకుంటాడు. బంతి తక్కువ ఎత్తులో వచ్చినా, పక్కకు తిరిగినా సాహా ఏమాత్రం తడబడడు” అని రోహిత్ కొనియాడాడు.
Rohit Sharma talking about Wriddhiman Saha’s wicketkeeping, saying that he is one of India’s greatest wicketkeepers.❤️
The most underrated wicket keeper @Wriddhipops ❤️ pic.twitter.com/uYDWaIs0g0
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 19, 2025
వృద్ధిమాన్ సాహా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టులు ఆడి 92 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు చేశాడు. అయితే ధోనీ వంటి దిగ్గజం జట్టులో పాతుకుపోవడం, ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో సాహాకు అవకాశాలు తగ్గాయి. సాహా కీపింగ్‌లో టాప్ అయినప్పటికీ, పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేయగలగడం అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. అయినప్పటికీ, కేవలం కీపింగ్ స్కిల్స్ గురించి మాట్లాడితే మాత్రం సాహాకు మించిన మొనగాడు లేడని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..