Rohit Sharma: రవిశాస్త్రితో టీమిండియాకు చెడ్డ రోజుల కంటే ఎక్కువగా మంచి రోజులే కనిపించాయి. దాదాపు ఏడేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఆయన పనిచేశారు. నిన్నటితో రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. సోమవారం దుబాయ్‌లో జరిగిన భారత చివరి సూపర్ 12 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించడంతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ప్రపంచ కప్‌కు ముందు టీ20ఐ కెప్టెన్సీని వదులుకోంటున్నట్లు విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీ20ఐ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది చివరి మ్యాచ్. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే.
అయితే విరాట్ కోహ్లీ తరువాత టీమిండియా టీ20ఐలకు కెప్టన్‌గా ఎవరుంటారనే విషయంలో ఇప్పటికే రోహిత్ పేరు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీనిపై రవిశాస్త్రి తన స్వరాన్ని వినిపించారు. టీ20ఐ క్రికెట్‌లో భారత క్రికెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లగల సామర్థ్యం రోహిత్ శర్మకు ఉందని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు.
“రోహిత్‌లో, మనకు ఒక సమర్థుడైన వ్యక్తి కనిపిస్తాడు, అతను చాలా ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్నాడు. చాలా కాలంగా భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు’ అని శాస్త్రి విలేకరులతో అన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాస్ సమయంలోనూ టీ20 కెప్టెన్సీకి రోహిత్ శర్మను తన వారసుడిగా ధృవీకరించిన విషయం తెలిసిందే. సీనియర్ ఓపెనర్‌గా రోహిత్ కొంతకాలంగా చాలా విషయాలను గమినస్తున్నాడని కోహ్లీ పేర్కొన్నాడు. బయో బబుల్, ఫార్మాట్ల ప్రకారం స్ప్లిట్ కెప్టెన్సీ చాలా అవసరమని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
టీ20 ప్రపంచ కప్ సమయంలో భారత జట్టు ‘మానసికంగా, శారీరకంగా కుంగిపోయింది. కీలక మ్యాచుల్లో ఒత్తిడి పరిస్థితులలో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. గెలవడానికి ప్రయత్నించలేదు. అని ఆయన తెలిపాడు. “నేను మానసికంగా కుంగిపోయాను, కానీ నా వయస్సులో కోచింగ్ భాధ్యతను సక్రమంగానే చేశాను. కానీ కుర్రాళ్లు శారీరకంగా, మానసికంగా క్షీణించారు. ఒక బుడగలో ఆరు నెలలు.. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ కూడా లేకపోవడం దెబ్బ తీసింది’ అని శాస్త్రి పేర్నొన్నాడు.
‘ అయితే తాను సాకులు చెప్పదలచుకోలేదని, అయితే ఇక్కడ మ్యాచ్‌లను ప్రయత్నించి గెలవడానికి కూడా జట్టు అత్యుత్తమ స్థితిలో లేదని’ ఆయన అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఆరవ బౌలింగ్ ఎంపికపై మాట్లాడుతూ, “ఇంతకుముందు, మేం మధ్య ఓవర్లలో స్పిన్నర్లను కలిగి ఉన్నాం. టాప్ సిక్స్‌లో కుర్రాళ్లను కలిగి ఉండేవాళ్లం. ఈ సారి అది మిస్సయ్యాం. దీంతోనే ఆరో బౌలర్ విషయం తెరపైకి వచ్చింది. అందుకే మ్యాచుల్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాం” అని తేల్చి చెప్పాడు.
Also Read: Ravi Shastri: పెట్రోల్ పోసి వాహనాలను నడపొచ్చు.. మనుషులను కాదు: బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు