IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ..

|

Oct 15, 2024 | 3:11 PM

2023 ODI ప్రపంచ కప్‌లో కాళ్లి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోలుకోవడంపై భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్టు సిరీస్‌లో షమీ రాణిస్తాడా లేదా అనేది డౌంట్‌గా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. "నిజం చెప్పాలంటే, ఆస్ట్రేలియా సిరీస్ కోసం షమీని తీసుకోవాలనుకోవట్లేదు..అతనికి మోకాళ్లలో వాపు వచ్చింది. ప్రస్తుతం అతను డాక్టర్లు, ఫిజియోలతో NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)లో ఉన్నాడు" అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ..
Rohit Sharna
Follow us on

2023 ODI ప్రపంచ కప్‌లో కాళ్లి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కోలుకోవడంపై భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్టు సిరీస్‌లో షమీ రాణిస్తాడా లేదా అనేది డౌంట్‌గా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. “నిజం చెప్పాలంటే, ఆస్ట్రేలియా సిరీస్ కోసం షమీని తీసుకోవాలనుకోవట్లేదు..అతనికి మోకాళ్లలో వాపు వచ్చింది. ప్రస్తుతం అతను డాక్టర్లు, ఫిజియోలతో NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ)లో ఉన్నాడు” అని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ODI ప్రపంచ కప్ ఫైనల్ నుండి షమీ ఆడలేదు. ఫిట్‌నెస్ పెండింగ్‌లో ఉన్నందున, అతను 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాలో జరిగే భారత రెండు టెస్టుల పర్యటన కోసం జట్టులో చేరుతాడని తెలుస్తుంది.అయితే, షమీ పర్యటనకు బీసీసీఐ వైద్య బృందం క్లియర్ చేయలేదు.భారత్ ప్రస్తుతం WTC స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. మొత్తం ఎనిమిది టెస్టులు ఆడటానికి మిగిలి ఉన్నాయి కివీస్‌తో స్వదేశంలో మూడు, ఆస్ట్రేలియాలో ఐదు ఉన్నాయి. WTC ఫైనల్ వచ్చే ఏడాది జూన్‌లో జరగనుంది.

ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా ఎ అంచనా జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (సీ), అభిమన్యు ఈశ్వరన్, శ్రేయాస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రికీ భుయ్, ఇషాన్ కిషన్ (డబ్ల్యూకే), అభిషేక్ పోరెక్ (డబ్ల్యూకే), మానవ్ సుత్ , తనుష్ కోటియన్, హర్షిత్ రాణా, యష్ దయాల్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్