
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టెస్ట్ బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈసారి కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు.అలాగే ఈసారి టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే… భారత్ నుంచి హిట్‌మన్ మినహా మరే బ్యాటర్ టాప్-10లో కనిపించలేదు. 11వ స్థానంలో రిషబ్ పంత్ ఉండగా, విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉన్నాడు. ఛటేశ్వర్ పుజారా 29వ ప్లేస్‌లో ఉండగా, రవీంద్ర జడేజా 38వ స్థానంలో ఉన్నారు. ఇటీవల అరంగేట్రంలోనే విండీస్‌పై సెంచరీ బాదిన యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకిగ్స్ లో 73వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు.
1. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)- 883 పాయింట్లు
2. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)- 874 పాయింట్లు
3. బాబర్ ఆజం (పాకిస్థాన్)- 862 పాయింట్లు
4. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 855 పాయింట్లు
5. మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా)- 849 పాయింట్లు
6. జో రూట్ (ఇంగ్లండ్)- 842 పాయింట్లు
7. ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా)- 824 పాయింట్లు
8. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)- 792 పాయింట్లు
9. దిముత్ కరుణరత్నే (శ్రీలంక)- 780 పాయింట్లు
10. రోహిత్ శర్మ (భారత్)- 751 పాయింట్లు
An India batter has stormed into the top 10 of the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 💥
More 👇https://t.co/3jbXGc7SNl
— ICC (@ICC) July 19, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..