కెప్టెన్‌గా వరుస విజయాలు అందుకున్న రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది. రోహిత్ గొప్ప కెప్టెన్ అని మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ అన్నారు. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 2-0తో శ్లంకను ఓడించింది. శ్రీలంకపై ఈ విజయంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకింది. సుదీర్ఘమైన ఫార్మాట్‌లో భారత్ తన తదుపరి టెస్ట్ ఈ సంవత్సరం జులైలో ఇంగ్లాండ్‌తో జరుగనుంది. ఇక్కడ గత సంవత్సరం ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ జరిగింది. ఐదో మ్యాచ్ అప్పుడు జరగలేదు. ఆ మ్యాచ్‌ను వచ్చే జులైలో ఆడనుంది. జాఫర్ రోహిత్ గురించి మాట్లాడుతూ.. “అవును, అతను (విరాట్ కోహ్లీ కంటే మెరుగైన టెస్ట్ కెప్టెన్) కాగలడు. అతను ఎన్ని టెస్టులకు కెప్టెన్‌గా ఉంటాడో తెలియదు, కానీ అతను అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని నేను భావిస్తున్నాను.
ఈ ఏడాది ఆరంభంలో రోహిత్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికా టూర్ తర్వాత కోహ్లి నుంచి పగ్గాలు చేపట్టాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ను గెలిపించాడు. ఈ హిట్‌మ్యాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్నాడు. ముంబై మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చెస్తోంది.
Read Also.. Prithvi shaw: ఆ పరీక్షలో ఫెయిలైన పృథ్వీ షా.. ట్రోల్ చేస్తున్న నేటిజన్లు..