Rohit Sharma : హిట్ మ్యాన్ మొదలెట్టాడు..సౌతాఫ్రికాపై దండయాత్రకు సిద్ధం..ఇక బౌలర్ల ఊచకోతే

బీసీసీఐ నవంబర్ 23న సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతుంది. ముఖ్యంగా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ రాబోయే వన్డే సిరీస్‌ కోసం తన సాధనను మొదలుపెట్టారు.

Rohit Sharma : హిట్ మ్యాన్ మొదలెట్టాడు..సౌతాఫ్రికాపై దండయాత్రకు సిద్ధం..ఇక బౌలర్ల ఊచకోతే
Rohit Sharma

Updated on: Nov 25, 2025 | 7:04 AM

Rohit Sharma : బీసీసీఐ నవంబర్ 23న సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతుంది. ముఖ్యంగా యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ రాబోయే వన్డే సిరీస్‌ కోసం తన సాధనను మొదలుపెట్టారు.

ముంబై ఇండియన్స్ కోచ్‌తో రోహిత్ సీక్రెట్ ట్రైనింగ్

టీమిండియా తరఫున రోహిత్ శర్మ ఆఖరి మ్యాచ్ ఆడి దాదాపు నెల రోజులు అయింది. సౌతాఫ్రికా సిరీస్‌కు పూర్తి ఫిట్‌గా సిద్ధమయ్యేందుకు రోహిత్ తన పాత మిత్రుడైన ముంబై ఇండియన్స్ ఫిజియోథెరపిస్ట్ అమిత్ దూబే సహాయం తీసుకుంటున్నారు. అమిత్ దూబే 2017 నుంచి 2020 వరకు బీసీసీఐ కింద, ఆ తర్వాత డిసెంబర్ 2022 నుంచి ముంబై ఇండియన్స్‌కు పనిచేస్తున్నారు. రెగ్యులర్ కెప్టెన్ గిల్ దూరం కావడంతో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రోహిత్ తన అనుభవాన్ని పంచుకుంటూ అండగా నిలవాల్సిన బాధ్యత పెరిగింది.

కేఎల్ రాహుల్‌కు సీనియర్ల మద్దతు కీలకం

కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నప్పటికీ, సీనియర్ ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టుకు తమ అనుభవాన్ని సపోర్టును అందించనున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా రోహిత్, విరాట్ కోహ్లీ కొత్త కెప్టెన్ శుభమన్ గిల్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి రాహుల్‌కు కెప్టెన్‌గా గిల్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నా, రోహిత్, విరాట్ సరైన మార్గదర్శనం చేస్తూ జట్టుకు తమ వంతు సహకారం అందిస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

సౌతాఫ్రికా సిరీస్ కోసం భారత జట్టు, షెడ్యూల్

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. కేఎల్ రాహుల్ (కెప్టెన్), వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి (బ్యాట్స్‌మెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా (ఆల్‌రౌండర్స్), కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా (బౌలర్లు) జట్టులో ఉన్నారు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్:

మొదటి వన్డే: నవంబర్ 30 – రాంచీ

రెండవ వన్డే: డిసెంబర్ 3 – రాయ్‌పూర్

మూడవ వన్డే: డిసెంబర్ 6 – విశాఖపట్నం

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..