INDIA VS ENGLAND 2021: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. స్వదేశంలో 200 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగుల వద్ద రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్వదేశంలో 186 సిక్స్‌లు బాదగా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 113 సిక్స్‌లు కొట్టాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 428 సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు.
కాగా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అన్ని ఫార్మాట్లు కలిపి 534 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది 476 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి ఎంఎస్ ధోని 359 సిక్స్‌లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఆఫ్రిది ఇప్పటికే రిటైర్ కావడంతో.. రోహిత్ త్వరలోనే అతన్ని అధిగమించే అవకాశం ఉంది. కాగా రోహిత్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.
INDIA VS ENGLAND 2021: ఇండియా రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. ఏ విషయంలో తెలుసా..